రాక్షస పాలనకి అంతం, ప్రజా పాలనకి ఆరంభం

  • నియంతలతో యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైనది
  • ఆళ్ళగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య

ఆళ్ళగడ్డ: పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అనే పేరుతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు, లోకేష్ లను పల్లకిలో మోస్తున్నట్టు చిత్రీకరించిన బ్యానర్లను ఆళ్ళగడ్డ టౌన్ లో వైయస్సార్సీపి నాయకులు ఫ్లెక్సీలను కట్టడాన్ని ఆళ్ళగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య తీవ్రంగా ఖండించారు. కట్టిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని, తొలగించని పక్షంలో వైసీపీకి వ్యతిరేకంగా జనసేన తరఫున మేము కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని ఆళ్ళగడ్డ టౌన్ ఎస్ఐ తిమ్మయ్య మరియు ఆళ్ళగడ్డ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు లకు వినతి పత్రం అందజేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించింది బడుగు, బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు రాజకీయంగాను, ఆర్థికంగానూ వారిని పల్లకి ఎక్కించడానికి ప్రజల తరఫున పోరాడుతున్నారని జనసేన పార్టీని స్థాపించింది వేరే పార్టీ వాళ్ళను ముఖ్యమంత్రి చేయడానికి కాదని రాష్ట్ర భవిష్యత్తు దృశ్య రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా జనసైనికులుగా పనిచేస్తామని తెలియజేశారు. ఆళ్ళగడ్డ వైసిపి ఎమ్మెల్యే గెలిచి నాలుగు సంవత్సరాలలో నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలి. కానీ ఒక పార్టీ అధ్యక్షుని బ్యానర్లు కట్టి జనసైనికులు, అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా వైసిపి నాయకులు ప్రవర్తించడం ఆళ్ళగడ్డ 2024లో వారి రాజకీయ పతనం మొదలైంది అనడానికి సంకేతం అని తెలియజేశారు. ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ప్రతి ఇంటిలో పవన్ కళ్యాణ్ గారు అభిమానులు, జనసైనికులు ఉన్నారని, మీరు అవమానపరిచింది పవన్ కళ్యాణ్ గారిని కాదని, లక్షల మంది అభిమానులను అవమానంగా భావిస్తున్నారని, 2024లో వైసిపి నాయకులకు సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఆళ్ళగడ్డ వైసీపీ నాయకుల ఎర్ర మట్టి దందా, ఇసుక దందా, మార్కెట్ యార్డ్ లో గోనె సంచుల దందా, అలాగే గేటు వసూళ్ల దందాల గురించి జనసేన పార్టీ తరఫున మేము కూడా ఫ్లెక్సీలు వేయగలమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాబు హుస్సేన్, కోటి, వెంకటసుబ్బయ్య, రమణాచారి, కుమ్మరి నాగేంద్ర, రాము, బ్రహ్మేంద్ర కుమార్, ప్రతాప్, విజయ్, కమల్ భాష, కేశవ తదితరులు పాల్గొన్నారు.