పవనన్న ప్రజా బాటకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు

  • పవనన్న ప్రజా బాట 66వ రోజు

వైజాగ్ సౌత్: దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దక్షిణ నియోజకవర్గంలో నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. డాక్టర్ కందుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సోమవారం నాటికి 66వ రోజుకు చేరుకుంది. నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతాన్ని ఆయన సందర్శిస్తూ.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురికి సహాయాన్ని అందజేస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా గొల్లల పాలెం ప్రాంతంలో పుష్పవతి అయిన లహరి అనే అమ్మాయికి పట్టు బట్టలు, వెండి పట్టీలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ప్రజలకు నిస్వార్ధ సేవలు అందించడమే తన కర్తవ్యం అన్నారు. కుల మతాలకు, వర్గాలకు తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తుందన్నారు. తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశానని పేర్కొన్నారు. తన సేవలు నిర్విరామంగా కొనసాగుతాయని వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్థానిక జనసేన నాయకత్వంతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కార సాధనకు నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఆర్.నరేంద్ర కుమార్, రూప, త్రినాధ్, సన్నీ, లక్ష్మి, పుష్ప, సంధ్యా, సరస్వతి, జానకి, లలిత, ఝాన్సీ, బిసునీత, దుర్గా, కుమారి, దక్షిణ నియోజవర్గం యువ నాయకులు కేదార్నాథ్, బద్రీనాథ్ జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.