స్కూల్ పిల్లల ముందు విమర్శలు చేస్తూ.. విషం వెల్లగక్కడం సంస్కారహీనం

  • ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై విరుచుకుపడిన అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి

అనంతపురం: అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి గురువారం అనంతపురం జనసేన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇస్తున్న పథకాలకే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ స్కూల్ పిల్లల చేత గొప్పలు చెప్పించుకుంటూ శునకానందం పొందుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు?. స్కూల్ పిల్లల ముందర రాజకీయ విమర్శలు చేస్తూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి విషం వెల్లగక్కడం సంస్కారహీనం, నీచం, నికృష్టమైన చర్య, అనంతపురం జిల్లా జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ నాయకుల్లారా, కార్యకర్తలారా ప్రజాధనంతో బహిరంగ సభ ఏర్పరిచి, బలవంతంగా జన సమీకరణ చేసి స్కూల్ పిల్లల ముందర మీ నాయకుడు జగన్ రెడ్డి గారు జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేయడాన్ని మీరు సమర్థిస్తున్నారా?.. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి గారు మేము జగన్ రెడ్డి గారిని విమర్శిస్తే మీరు బాధ పడిపోతారు, అభం! శుభం!! తెలియని అమాయకులైన దళిత నాయకులు చేత ప్రెస్ మీట్లు పెట్టించి బహిరంగంగా దూషిస్తూ శునకానందం పొందుతారు? అనవసరంగా మాపైన తప్పుడు కేసులు పెడతారు?. జగన్ రెడ్డి గారు మీకు సూటిగా అడుగుతున్నాం? “గురిగింజ తన నలుపు పెరగదు అన్నట్టుగా” మీ ముత్తాత వెంకట్ రెడ్డి గారి నుంచి నేడు మీ కుటుంబ సభ్యులకు ఎవరెవరికి? ఎన్ని పెళ్లిళ్లు జరిగాయి మీకు తెలియదా?.. మీ ముత్తాత గారి కాలం నుంచి నేటి వరకు మీ కుటుంబ సభ్యులు కొంతమంది ఎవరెవరితో? అక్రమ సంబంధాలు పెట్టుకున్నారో మీకు తెలియదా?.. మీరు పాపం పసి బాలుడు కదా? మేము ఏదన్నా అంటే!! మీ నాయకులు, కార్యకర్తలు బాధపడి పోతారు?. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గతంలోనే చెప్పారు కొన్ని విపత్కర పరిస్థితుల్లో న్యాయపరంగా విడాకులు ఇచ్చి పెళ్లిళ్లు చేసుకోవలసి వచ్చింది అని. నాలుగో పెళ్లి అంటున్నారు? జగన్ రెడ్డి గారు మీరేమైనా పవన్ కళ్యాణ్ గారిని మొగుడుగా ఊహించుకుంటున్నారా?. వారాహి యాత్ర ఉభయగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతూ ఉండడంతో 2024లో వైసీపీ అధికారంలోకి రాదు అని దిక్కు తోచని స్థితిలో, ఏమి చేయాలో అర్థం కాక? ఎలా చేయాలో అర్థం కాక? అసహనంతో దుర్విమర్శలు చేస్తున్నారు? మేము తీవ్రంగా ఖండిస్తున్నామని జయరాం రెడ్డి తెలిపారు.