పాత గుంతకల్ రోడ్ల దుస్థితిపై గళమెత్తిన అరికేరి జీవన్ కుమార్

గుంతకల్లు నియోజకవర్గం: గుంతకల్లు పట్టణంలోని కసాపురం రోడ్ & పాత గుంతకల్ రోడ్లను గురువారం అనంతపూర్ జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్ పరిశీలించారు. ఈ సంద్భంగా అరికేరి జీవన్ కుమార్ మాట్లాడుతూ.. దక్షణ భారత దేశం ప్రముఖ పుణ్యక్షేత్రం అయినట్టువంటి శ్రీ కసాపురం నెట్టికంట ఆంజనేయ స్వామి వారిని వేలాది మంది భక్తులు ఈ మార్గం గుండా ప్రయాణిస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగి అవకాశం ఉందని, కొందరు భక్తులు గాయాలపాయ్యారని తెలియచేయడం జరిగింది. మరియు పాత గుంతకల్ కూడా ఇదే విధంగా ఉంది అన్ని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చెప్పటిన నాటి నుండి ప్రజలను గాలికి వదిలేసింది తప్ప ఏ నాడు ప్రజల పక్షాన నిల్చలేదని, అందుకు నిద్శనమే ఈ రోడ్ల దుస్థితిని అని, ఈ రకంగా రోడ్లు మధ్యలో పెద్ద, పెద్ద గుంతల వల్ల రోడ్ యాక్సిడెంట్ లు జరుగుతున్నాయి అని, అవి రోజు, రోజుకు పెరుగుతున్నాయని, యాక్సిడెంట్ ద్వారా వాహనదారులకు కాళ్ళు – చేతులు ఫ్రాక్చర్ అయిందని, కొన్ని సందర్బాలలో ప్రాణాల మీదికి వస్తుంది, కొందరు అయితే ప్రాణాలు కూడా కోల్పోయారని, వీటికి అన్నిటికీ వైసీపీ ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపూర్ జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు అమీన్ సోహైల్, 1వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి హెన్రీ పాల్ (ఎల్ ఎల్ బి), గుంతకల్లు నియోజకవర్గం మైనారిటీ నాయకులు షేక్ జిలన్ బాషా, యువ నాయకులు మరుతి కుమార్ యాదవ్, అరవింద్ రాజా, చిన్న, తాడిపత్రి మహేష్ కుమార్, ఆర్చి సురేష్ కుమార్ ((ఎల్ ఎల్ బి), జనసైనికులు అరవింద్, లడ్డు, ప్రకాష్, చంద్ర, కిరణ్, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.