కొమురంభీం జిల్లాలో పులి కోసం వేట

కొమురంభీం జిల్లాలో పులి కోసం వేట కొనసాగుతోంది. అటవీశాఖ అధికారులను పులి ముప్ప తిప్పలు పెడుతోంది. చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటోంది. ఆపరేషన్ నిర్వహిస్తున్న కంది భీమన్న అటవీ ప్రాంతంలో పులి కనిపించలేదు. ఇక్కడి నుంచి వెళ్లి పోయినట్టు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. పులి కదలికల ఆధారంగా ఆపరేషన్ కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో పులిని బంధించేందుకు ఏర్పాట్లు చేశామని.. అటవీ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీసీఎఫ్ వినోద్ కుమార్ సూచించారు.