జనసేనతో రాజకీయాల్లో పెనువిప్లవం తీసుకొచ్చిన జనసేనాని

  • జనసేన మండల నాయకులు తల్లే త్రిమూర్తి

పాడేరు: జి.మాడుగులలో తుమ్మెదలనేరోడి గ్రామాన్ని జనసేన పార్టీ నాయకులు సందర్శించి స్థానిక గ్రామస్తులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా గ్రామంలోని ప్రజలతో సమావేశమై జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు లక్ష్యాలు తెలియజేస్తూ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జనసేనాని నిర్వహించే వారహి యాత్ర విశేషాలు తెలియజేసారు. జనసేన మండల నాయకులు తల్లే త్రిమూర్తి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి పెనువిప్లవాన్ని తీసుకొచ్చారు. అవినీతి రహితపాలన కోసం అహర్నిశలు శ్రమిస్తూ ప్రజల్లో విశేష ఆదారణ పొందుతున్నారు. ఇది రాజకీయంగా ప్రత్యర్థులకు గడ్డు కాలమేనని చెప్పాలి. ఏ అధికారం లేని నాయకుడు ప్రసంగానికి అధికార, ప్రతిపక్ష నాయకులు సైతం భయపడుతున్న సందర్భాలు చూస్తున్నాం. మనం గిరిజనులుగా అభివృద్ధి పథంలో చిట్ట చివరన ఉన్న ఆదివాసీ ప్రజలం మనం. టీడీపీ పాలన చూసేసాం ఏం ఒరిగింది గిరిజన ప్రాంతాలకు, వైసీపీ ప్రభుత్వాన్ని చూస్తున్నాం మన హక్కులు, జీవోలు కళ్లెదుటే కోల్పోతున్నా ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం, వాళ్ళ రాక్షస పాలనకు సహకరించే ఆదివాసీ ద్రోహులు మన గిరిజన ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరి చూస్తున్నాం, ఒక అరాచక పాలన పంటిబిగువున బరిస్తువున్నాం. ఈ రాక్షస పాలన పోవాలంటే ఒక్క అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఇద్దాం. జనసేన పార్టీ అధికారం చేపట్టడానికి మనం కూడా ఆలోచన చేద్దామని అన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. 12 అంశాల గిరిజన సమస్యలకు సంబంధించిన కరపత్రం తల్లే త్రిమూర్తి ఆధ్వర్యంలో డా. గంగులయ్య జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ అదేశాలమేరకు ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, సోమన్న, గంగాధర్, మోహన్, రవి, వెంకటరమణ, రాంబాబు, రాజబాబు, రాజు, వెంకటరమణ, చిన్నబాబు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.