వచ్చే ఎన్నికల్లో జగన్ కు తలనొప్పిగా మారనున్న వాలంటీర్ వ్యవస్థ

  • ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధికారప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు

అవనిగడ్డ నియోజకవర్గం: వచ్చే ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థ జగన్ కు తలనొప్పిగా మారనున్నదని ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధికారప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు పేర్కొన్నారు. మంగళవారం వేణుగోపాల్ రావు విలేకరులతో మాట్లాడుతూ.. కేవలం వాలంటీర్ సేవలకే యువత ప్రతిభ పరిమితం కారాదు. వాలంటీర్ల పేరుతో యువతను నిర్వీర్యం చేసిన జగన్.. పంచాయతీ రాజ్ వ్యవస్థ ఉండగా దానికి సమాంతరంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు .. ఇందులో ప్రధానంగా డిగ్రీ చదివిన వ్యక్తులు అనేక మంది ఉన్నారు.. వారితో ఎంతో చారికి చేయించుకుని 5000 జీతం మాత్రమే ఇస్తూ యువ శక్తిని నిర్వీర్యం చేస్తున్న జగన్.. ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ఉండాల్సిన ఈ వ్యవస్థ 90% వైసీపీ కార్యకర్తలతో నిండిపోయింది.. ఈరోజున భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు ఎదో ఒకటి ప్రతి మండలంలో తీసుకొస్తే డిగ్రీ చదివి వాలంటీర్లగా చేస్తున్న వారు నెలకు 20 వేలు సంపాదించుకునేవారు వాలంటీర్ అనే దగ్గర ఈ యువతరం ఆగిపోయింది కానీ వారిలో ఒక అబ్దుల్ కలాం గారు ఉండవచ్చు, ఒక అంబేద్కర్ గారు ఉండవచ్చు, ఒక సత్య నాదెండ్ల గారు ఉండవచ్చు, ఒక సుందర్ పిచ్ఛయ్య గారు ఉండవచ్చు.. వారి టాలెంట్ నిర్వీర్యం అయ్యే విధంగా ఒక్క వాలంటీర్ సేవలకే పరిమితం అవుతున్నది.. సరైన ఉపాధి అవకాశాలు లేక వాలంటీర్ గా మారిన ఉక్కు నరం, ఇనుప కండరాలు ఉన్న యువతరం.. పైగా వాలంటీర్ల గా చేస్తున్న వారు 5000 తీసుకుంటూ ఎటువంటి వ్యాపారాలు చెయ్యకూడదు, ఏ పని చెయ్యకూడదు కేవలం వాలంటీర్ గా మాత్రమే పని చెయ్యాలి అంటు నిభంధన ఉంది.. కొంతమంది వాలంటీర్లు ఫెర్సొనల్ దత ని కొంతమంది చేతుల్లో పెడుతున్నారు అది చాలా ప్రమాదకరం ఢిల్లీ నిఘావర్గాల నుంచి ఈ సమాచారం నాకు చెప్పారు అని పవన్ కళ్యాణ్ చెప్తే దానిని పూర్తిగా వక్రీకరించి వైసీపీ పార్టీకి చెందిన వాలంటీర్లకి ట్రైనింగ్ ఇప్పించి పవన్ కళ్యాణ్ మీదకి ఉసిగొల్పుతున్నారు.. వాలంటీర్లలో ఉన్న యువశక్తిని నిర్వీర్యం చేసిందే గాక ఈరోజున పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదుర్కొలేక ఈవిధంగా వాలంటీర్ వ్యవస్థ అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ అన్నది ఎంటి వైసీపీ నాయకులు వాలంటీర్ల చేత చేయిస్తున్న ప్రచారం ఎంటి అందరూ గ్రహించాలి.. కేంద్ర ప్రభుత్వం దగ్గర, కేంద్ర నిఘావర్గాల చేతుల్లో ఖచ్చితమైన సమాచారం ఉంది.. త్వరలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నిఘా వర్గాలే స్వయంగా ఈవిషయాన్ని బయట పెట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాలంటరీస్ ను రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారిని అవమానపరచటం జనసేన పార్టీ తరుపున ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నామని రాయపూడి పేర్కొన్నారు.