కేంద్రం, రైతుల మధ్య కొనసాగుతోన్న తొమ్మిదో విడత చర్చలు..

సాగుచట్టాల రద్దును డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో పోరుబాట సాగిస్తున్న రైతులతో కేంద్రం తొమ్మిదో విడత చర్చలు జరుపుతోంది. కొద్దిసేపటి క్రితమే విజ్ఞాన్ భవన్‌లో రైతులకు, కేంద్ర మంత్రులకు మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ భేటీయే చివరి సమావేశం కావచ్చన్న వార్తల వస్తున్నాయి.

ఇదిలా ఉంటే చట్టాలపై స్టే విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా.. రద్దు తప్ప తమకు మరేదీ సమ్మతం కాదని రైతు సంఘాల నాయకులు తేల్చి చెబుతున్నారు. అలాగే ఈ అంశంపై సుప్రీం కోర్టు కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈసారి భేటీలో కేంద్రంతో ఏకాభిప్రాయం కుదురుతుందన్న ఆశలు లేవని కిసాన్ నేతలు అభిప్రాయపడుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించే ఉద్దేశం కేంద్రానికి లేదని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. తమకు ఎలాంటి కమిటీలు అవసరం లేదని.. సాగు చట్టాల రద్దు, తమ పంటలకు కనీసమద్దతు ధరనే తాము కోరుతున్నట్లుగా వెల్లడించారు.