చిరు పవన్ సేవాసమితి ఉచిత త్రాగునీరు

రాజోలు, సఖినేటిపల్లి గ్రామానికి చెందిన యేడిద పార్దమణికంఠ ట్రాక్టర్ డీజిల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా మంగళవారం అంతర్వేది దారికోడప మరియు సఖినేటిపల్లి పల్లిపాలెం ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది. అనంతరం కత్తిమండ ఆరేటి వారి మెరకకు చెందిన ఆరేటి వెంకట సత్యనారాయణ ట్రాక్టర్ డీజిల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా చిన్నడం గ్రామ ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని రాజోలు జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.