రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చిన వైసీపీ ప్రభుత్వం

  • వాలంటీర్స్ అభివృద్ధిని కోరుకునే నాయకుడు పవన్ కళ్యాణ్

కొండేపి, పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ మీద కించపరిచే వ్యాఖ్యలు చేశారు అంటూ, గత రెండు మూడు రోజుల నుండి కొంతమంది వాలంటీర్లు పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు నమోదు చేసే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ అభివృద్ధిని కోరుకునే వ్యక్తి, వాలంటీర్ అనే ఎదుగుదలలేని రాజ్యాంగ వ్యతిరేక పోస్టులో నియమించి, జీవితానికి జీతానికి గ్యారెంటీ విలువ లేకుండా చేసింది ఎవరు? వైసీపీ సభలకు రాకపోతే పథకాలు కట్ చేస్తామని ప్రజలను బెదిరించే విధంగా చేసింది ఎవరు? నీ వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఎవరికైనా ఇవ్వాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే మీరు, ఈరోజు ప్రజల వ్యక్తిగత వివరాలు తీసుకునే అవసరం కల్పించింది ఎవరు? ఉద్యోగం చేయాల్సిన మిమ్మల్ని రోడ్డు మీద బలవంతపు ధర్నాలకు వచ్చే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు?, డిగ్రీలు చదివి కొంతమంది వాలంటీర్లు కనీసం వారి ఇంటి రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వింటే 5 వేల రూపాయలు దగ్గర అవమానాలు పడుతూ ఉంటారు. అదే పవన్ కళ్యాణ్ చెప్పింది అర్థం చేసుకుంటే 10 లక్షల పెట్టుబడి సాయంతో మీ కాళ్లు మీద మీరు నిలబడతారు, ఒకసారి ఆలోచించండి అని ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు. అనంతరం సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ మాట్లాడుటూ గత మూడు రోజులుగా వైసిపి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వాక్యాలపై క్షమాపణ చెప్పాలని, వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను ధర్నాలు చేయాలని, దిష్టిబొమ్మలు తగలబెట్టాలని, వాలంటీర్లపై ఒత్తిడి తేవడం ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకానికి నిదర్శనం. ఈ విషయంపై సింగరాయకొండ జనసేన పార్టీ నుండి తీవ్రంగా ఖండించడం జరిగినది. ఇప్పటికైనా ప్రభుత్వ పాలసీ మీద ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి తప్ప వ్యక్తిగత విషయాలపై మాట్లాడటం మాని లేని విషయాన్ని వక్రీకరించి మాట్లాడటం ఇకనైనా మానుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని, జనసేన పార్టీ హెచ్చరిస్తుంది. వైసిపి ప్రతి మీటింగ్ లో పవన్ కళ్యాణ్ కి దమ్ముంటే దమ్ముంటే ఎమ్మెల్యేగా కూడా గెలవలేదని చెప్తున్నా ఈ వైసిపి నాయకులకు పవన్ కళ్యాణ్ కి దమ్ము టన్నుల్లో ఉందని వారాహి యాత్రలో చూసి మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయం మాట్లాడితే సహించబోమని జనసేన పార్టీ నుండి హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడా శశిభూషణ్, పొన్నాలురి మండల అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండల ఉపాధ్యక్షులు సయ్యద్ చాన్ భాష, అధికార ప్రతినిధి సంకే నాగరాజు, ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్, కార్యదర్శులు అనుమల శెట్టి కిరణ్ బాబు, గుంటుపల్లి శ్రీనివాస్, కిచెంశెట్టి ప్రవీణ్ కుమార్, వాయుల అనిల్, ప్రచార కార్యదర్శి తగరం రాజు, షేక్ సుల్తాన్ భాష, కమిటీ సభ్యులు శీలం సాయి, నాగమల్లి హరికృష్ణ, బత్తుల వినయ్ కుమార్, సిహెచ్ శివ, వీర మహిళలు ఐ రాధిక, యు రజినీ, పి మాధురి, ప్రమీల, లక్ష్మి, రమణమ్మ, మరియు జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.