సామాన్యులపై వాలంటీర్ కుటుంబం అరాచకం

ఒక వాలంటీర్ కుటుంబం సామాన్యులపై అరాచకానికి పాల్పడింది. ఈ ఘటన తిరుపతి సీతమ్మ నగర్ నందు చోటు చేసుకుంది. వివరాలలోనికి వెళితే.. స్థానిక సదుం, పీలేరు గ్రామస్థులైన నాగేంద్ర బ్రతుకు రీత్యా తిరుపతి సీతమ్మ నగర్ నందు తన భార్య, ముగ్గురు చిన్న పిల్లలతో జీవిస్తున్నారు. వీరి కుటుంబం జనసేనకు మద్దతుదారులుగా ఉన్నారు. అదే ప్రాంతంలో వాలంటీర్ గా పనిచేస్తున్న జానకి వారి కుటుంబ సభ్యులు కలసి కొంత మంది మద్యం మత్తులో ఉన్న రౌడీలచేత, మారణాయుధాలతో నాగేంద్ర కుటంబంపై దాడి చేయించారు. ఈ క్రమంలో నాగేంద్ర భార్య మెడలో ఉన్న బంగారు తాలి దొంగిలించారు. ఇది కేవలం వారు జనసేన పార్టీ వారు కావడం మాత్రమే.