స్క్రిప్ట్ మార్చండయ్యా.. పదే- పదే ఒకటే స్క్రిప్ట్ చదవలేక జగన్ కష్టపడుతున్నాడు

గుంటూరు: జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మరియు స్టేట్ కార్యదర్శి నయుబ్ కమల్ ప్రసంగించారు. ముందుగా గాదె మాట్లాడుతూ.. శుక్రవారం ముఖ్యమంత్రి గారు బట్టన్ నొక్కే కార్యక్రమానికి వెళ్లి పవన్ కళ్యాణ్ గారు అంటే తనలో ఉన్న భయాన్నంతా కక్కేసాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే వణికిపోతున్నాడు. ఎవరైనా ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వారి హయాంలో జరిగిన గొప్ప కార్యక్రమాలు, ఇకపై చెయ్యబోయే ప్రణాళికల గురించి చెబుతారు. కానీ మన ముఖ్యమంత్రి గారికి ఇదొక సరదా అయిపోయింది. ప్రభుత్వంలో ఉన్న ఆర్ధిక మంత్రి గారు అప్పులు తేవడం, ఈయన బట్టన్ లు నొక్కడం ఎంత మంది లబ్ది దారుల ఖాతాల్లోకి డబ్బు వెళుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇవాళ మాకున్న సమాచారం ప్రకారం మొన్న ముఖ్యమంత్రి గారు నొక్కిన అమ్మ ఓడి బటన్ కి సంబందించి సగం డబ్బులు కూడా లబ్దిదారులకు పడలేదు. ఇది వాస్తవం, ఇందులో కూడా ఆయన గతంలో చెప్పినట్టుగా రివర్స్ టెండరింగ్ విధం అమలు అవుతుంది. ప్రతి లబ్దిదారుడి ఖాతాలో 9000-10000 వరకు మాత్రమీ పడుతున్నాయన్నది మాకున్న సమాచారం. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఏదోకటి మాట్లాడాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి. నిజంగా మేము ఎప్పుడు పరిపాలన చెయ్యలేదు. మాకు ఎమ్మెల్యేలు కూడా లేరు. కానీ ఆయన పేరు ఎత్తడానికి కూడా నీకు ఎందుకు భయం సీఎం గారు?.. ఈ ముఖ్యమంత్రి మళ్ళి సంస్కారం గురించి మాట్లాడతాడు.. ఆయనకి స్క్రిప్ట్ రాసిచ్చే వ్యక్తి పేరు కృష్ణ మోహన్ అంట.. ఆ కృష్ణ మోహన్ కి చెప్తున్నాం కాస్త స్క్రిప్ట్ మార్చండి అయ్యా.. ఎంత స్పీడు పదే- పదే ఒకటే స్క్రిప్ట్ ఆయన చదవలేక కష్టపడుతున్నారు. జనం కూడా విసిగిపోతున్నారు. ముఖ్యమంత్రి గారు వాలంటీర్ వ్యవస్థని ఎందుకు పెట్టారు? వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ లు ఇవ్వడానికి 2,61000 మంది వాలంటీర్ లను పెట్టావు. వారందరు మళ్ళి నీ కార్యకర్తలే.. వాళ్ళకి 5000 రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళతో మీరు చేయిస్తున్న గొడ్డు చాకిరి గాని, అసాంఘిక కార్యక్రమాలు గాని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. ఈ వాలంటీర్ లను పెన్షన్ లు ఇచ్చేందుకు పెట్టుకుంటే శుక్రవారం కూడా ఓటర్ సర్వే లో వారు ఎందుకు పాల్గొన్నారు?. ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్తుంది.. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు తప్పితే వాలంటీర్లు ఎవరు దరిదాపుల్లో ఉండకూడదు అని ఆర్డర్ లు జారీ చేస్తే శుక్రవారం కూడా రాష్ట్రం మొత్తంలో సర్వేలో కోసం వెళ్లిన వీఆర్వోలతో వాలంటీర్లు ఉన్నారు అన్న మాట వాస్తవం. దేశం అంతా మా వైపు చూస్తుంది అని గొప్పగా ప్రకటనలు చేసుకుంటున్నారు. నిజమే చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారు? మనకి రాజధాని లేదని చూస్తున్నారు. రాజధాని లేని రాష్ట్రాన్ని పాలిస్తున్న ఘనత నీదే.. నాడు నేడు అంటూ పెద్ద గొప్పగా చెబుతావుగత అకాడమిక్ ఇయర్ నుండి ప్రస్తతం ఉన్న దానికి పోలిస్తే 6 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుండి ప్రైవేట్ పాఠశాలకు వెళ్లిపోయాయిరు అది నీ చరిత్ర. దమ్ముంటే నీ చరిత్ర గురించి డిబేట్ పెట్టుకుందాం. సంస్కార హీనంగా మాట్లాడద్దు అని ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాం. మీరు సంస్కారం తప్పి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తే రాష్ట్ర ప్రజలు మొహం మీదే చి కొడతారు తేల్చుకోండి. ఇప్పటికే మతిపోయింది వ్యక్తి లాగ ప్రవర్తిస్తున్నారు ముఖ్యమంత్రి గారు.. మారండి ఇకనైనా అంటూ వ్యాఖ్యానించారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్ బిట్రగుంట మల్లిక కార్పొరేటర్ ఎర్రం శెట్టి పద్మ చట్టాలు త్రినాథ్, కర్రపాటి నాగేశ్వరరావు, దాసరి వెంకటేశ్వరరావు, నెల్లూరి రాజేష్, గోపిశెట్టి సాయి, బీసాబత్తిన సాయి రామ్ తదితరులు పాల్గొన్నారు.