ఛలో కృష్ణాయపాలెం

గుంటూరు: ప్రజలను మోసం చేయడానికి మరోసారి బయల్దేరిన ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనకు పిలుపునిచ్చిన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మరియు స్టేట్ కార్యదర్శి నయుబ్ కమల్ మాట్లాడారు. సోమవారం ముఖ్యమంత్రి కృష్ణాయాపాలెంలో శంకుస్థాపనకు విచ్చేస్తున్న సందర్భంలో గుంటూరు జిల్లా కార్యాలయంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. మొన్నటిదాకా రాజధాని ప్రాంతం స్మశానమని ఒక మంత్రి, ఎడారి అని ఒకళ్ళు, మరొకరు ముంపు ప్రాంతమని మాట్లాడి ప్రభుత్వం ఈ రోజున అదే ప్రాంతంలో పేదలకు భూములు ఇస్తున్నామని చెప్పటం ఏంటని ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వ సలహాదారుకి మొన్నటిదాకా గుర్తుకురాని రాజధాని ప్రాంతం ఈరోజున ఒక్క సారిగా గుర్తొచ్చిందని, అలాగే వీళ్ళు ఇచ్చే సెంటు స్థలంతో ఐదేళ్ళు అక్కడున్న ప్రజలు కోటీశ్వరులు అయిపోతారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇప్పుడు మరోసారి ఈ ముఖ్యమంత్రి పేద ప్రజలు మోసం చేయడానికి బయలుదేరారని, హక్కు లేని ప్రభుత్వ భూములను పేదలని అడ్డం పెట్టుకొని, పేదలకు భూములు ఇచ్చే నెపంతో రాజధానిని నాశనం చేసే విధంగా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నివాసం నుంచి కృష్ణయపాలెం కి 6 కిలోమీటర్లు ఉంటుందని, అక్కడినుంచి వెంకటపాలెం రెండు కిలోమీటర్లు ఉంటుందని, ఈ కొంచెం దూరం కూడా నేల మీద నడవడానికి ముఖ్యమంత్రి భయపడి హెలికాప్టర్లో వెళ్తున్నారు. కొంచెం దూరం వెళ్లడానికి కూడా లక్షల రూపాయల ప్రజాధనంతో రెండు హెలిపాడ్లు ఒకటి కృష్ణాయాపాలెం మరొకటి వెంకటపాలెంలో నిర్మిస్తూ ఉన్నారు. పేదలకు మంచి చేస్తున్నామని చెప్పుకున్న ముఖ్యమంత్రి నేల మీద ప్రయాణం చేయడానికి ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి ప్రశ్నించారు. 50 వేల మందికి సరైన వసతులు లేని చోట భూములు ఇచ్చి ఆ ప్రాంతాన్ని ఒక మురుగు కుపం లాగా తయారు చేయడం తప్ప ఇంకొకటి లేదని తెలియజేశారు. శంకుస్థాపనలు తప్ప ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయని ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని, పెత్తందారులు పేద ప్రజలకు మధ్య యుద్ధం అని మాట్లాడే ఈ ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ లో జరుగుతున్న అసలైన పెత్తందారీ అని ఎద్దేవా చేశారు. అలాగే సోమవారం కృష్ణయ్య పాలెంలో జరగబోయే శంకుస్థాపన కార్యక్రమం దగ్గర ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేయాలని ఛలో కృష్ణాయాపాలెం కార్యక్రమానికి ఆయన జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి పోలీసు వారు సహకరించాలని, అలాగే జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి నాయుబ్ కమల్ మాట్లాడుతూ 90 శాతం పూర్తి చేసిన టిట్కో ఇళ్లను చెదలు పట్టే దాకా ముఖ్యమంత్రి పేదలకు ఇవ్వకుండా ఎందుకు ఉంచారు అని ప్రశ్నించారు. రాజధాని లేకుండా నాలుగున్నర సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన ఘనత ఈ ముఖ్యమంత్రి కే దక్కుతుందని తెలియజేశారు. మీ బిడ్డ మీ బిడ్డ అని చెప్పుకునే ముఖ్యమంత్రి ఒక్క రోజైనా వాళ్లకి ఇచ్చే సెంటు స్థలంలో నిద్ర పోవాలని చెప్పారు. లక్షల కోట్ల అవినీతి చేసిన ముఖ్యమంత్రి తన సొంత డబ్బు ఒక్క రూపాయి కూడా పేద ప్రజల కోసం ఖర్చు పెట్టలేదని, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆత్మహత్య చేసుకున్న మూడువేల కౌలు రైతుల కుటుంబాలకు తన సొంత డబ్బు ఇచ్చారని తెలియజేశారు. 2024లో ఈ పరిపాలన పోయి ప్రజా ప్రభుత్వం వస్తుందని తెలియజేశారు. తదననంతరం సీఎం గో బ్యాక్ అనే ప్లాకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి కన్నా రజిని, జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, బిట్రగుంట మల్లిక, నారాదాసు రామచంద్ర ప్రసాద్, చట్టాల త్రినాథ్, శిఖా బాలు, కార్పొరేటర్లు యర్రంశెట్టి పద్మావతి, దాసరి లక్ష్మీ దుర్గ, నెల్లూరు రాజేష్, శ్రీపతి భూషయ్య, మధులాల్, దాసరి వెంకటేశ్వరరావు, తన్నీరు గంగరాజు, గోపిశెట్టి సాయి తదితరులు పాల్గొన్నారు.