రిపబ్లిక్ డే వేడుకల్లో రఫేల్ విన్యాసాలు

ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో రఫేల్ ఫైటర్ జెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఫ్లైపాస్ట్‌ను రఫేల్ ఫైటర్ చేసే విన్యాసాలతోనే ముగించనున్నట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వెల్లడించింది. రఫేల్‌ వర్టికల్ చార్లీ విన్యాసాలు చేయనున్నట్లు తెలిపింది. వర్టికల్ చార్లీ విన్యాసాల్లో భాగంగా ఓ ఎయిర్‌క్రాఫ్ట్ మొదట తక్కువ ఎత్తులో ఎగురుతూ.. ఆ తర్వాత నిలువుగా తన చుట్టూ తాను తిరుగుతూ పైకి దూసుకెళ్తుంది. ఈసారి వేడుకల్లో ఒక రఫేల్ ఎయిర్‌క్రాఫ్ట్ ఈ వర్టికల్ చార్లీ విన్యాసాలు చేస్తుందని వింగ్ కమాండర్ ఇంద్రనీల్ నంది వెల్లడించారు. ఫ్లైపాస్ట్‌లో మొత్తం 38 ఐఏఎఫ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఇండియన్ ఆర్మీకి చెందిన నాలుగు విమానాలు పాల్గొననున్నాయి.