ఇచ్ఛాపురం జనసేన ఆధ్వర్యంలో జగనన్న కాలనీ సోషల్ మీడియా క్యాంపెయిన్

ఇచ్ఛాపురం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగనన్న కాలనీ ముసుగులో పేదలకు వైసీపీ చేసిన అతిపెద్ద మోసంను, కుంభకోణాలను మరోసారి #FailureOfJaganannaColony హ్యష్ ట్యాగ్ తో సోషల్ మీడియా క్యాంపెయిన్ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం ఇచ్ఛాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి దాసరి రాజు జనసేన నాయకులతో కలిసి కవిటి మండలంలోని కొత్తపాలెం, కుసుంపురం గ్రామాల్లో జగనన్న కాలనీలు సందర్శించారు. ఈ సందర్భంగా దాసరి రాజు మాట్లాడుతూ జగనన్న కాలనీల పేరుతో పేద ప్రజలకు లోతట్టు ప్రాంతాలలో స్థలాలు ఇచ్చి వారి జీవితాలతో ఆడుకోవడం సరికాదని, ఇళ్లు కట్టుకోవడం అనేది పేదవాడి కల అని, వారికి ప్రభుత్వము ఓటరుగా చూడటం మాని, మంచి ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. కవిటి మేజర్ పంచాయతీ కొత్తపాలెంలో సుమారు 180 ఇల్లు స్థలాలు తుంపరలో ఇచ్చారు. ముప్పు ప్రాంతాల్లో కేవలం పునాది వేయడానికి 2 లక్షల వరకు అవుతుంది. పేదవాడు మొత్తం ఇల్లు ఎలా కట్టుకోగలడు అని ప్రశ్నించారు. కుసుంపురం పంచాయతీకి సంబంధించి ఇచ్చిన జగనన్న కాలనీలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కేవలం ఒకే రహదారి కలిగిన ఈ ప్రాంతంలో చెరువును ఆనించుకొని ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు, వర్షాకాలంలో డ్రైనేజీ సంబంధించిన నీరు మొత్తం చేరి ఇక్కడ జలమయం అవుతుంది. ఈ ప్రదేశాల్లో ఇల్లు నిర్మిస్తే పేదలకు ఇబ్బందులకు గురికావల్సి వస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా , మున్సపాలిటీ 10వ వార్డ్ ఇంఛార్జి రోకళ్ళ భాస్కర్, కుసుంపురం సర్పంచ్ అభ్యర్థి అంగ సురేష్, ప్రోగ్రాం కమిటీ సభ్యులు దుగాన దివాకర్, బడగల రామకృష్ణ, రాజశేఖర్,రాజు ధనుంజయ, తలగాన ఈశ్వర్, చలపతి, నవీన్, కవీశ్వరరావు, సోమేశ్, కేశవరావు, భాస్కర్ చిట్టిబాబు, శ్రీను పాల్గొన్నారు.