కూకట్పల్లి నియోజకవర్గ డివిజన్ కమిటీల నియామకం
తెలంగాణ రాష్ట్రం, కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, విలువలను, పార్టీ సిద్ధాంతాలను నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో ఉన్న ఇంటింటికి తీసుకు వెళ్లి బూత్ స్థాయిలో బలోపేతం చేయడం కోసం తెలంగాణ కూకట్పల్లి నియోజకవర్గం డివిజన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రెటరీ మరియు కమిటీ సభ్యులను నియమించడం జరిగినది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మరియు కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కూకట్పల్లి నియోజకవర్గంలోని యువకులను, పవన్ కళ్యాణ్ అభిమానులను మరియు వీర మహిళలను జనసేన పార్టీలోకి ఆహ్వానించి యూత్ వింగ్ మరియు శక్తివంతమైన వీరమహిళా విభాగాలను నియమించి మా అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లి నియోజకవర్గంలో నాలాలపై, ట్రాఫిక్ సమస్యలపై, వంద పడకల హాస్పిటల్ పై, ప్రభుత్వ పాఠశాల కొరకు పోరాడడం జరిగినదని, కరోనా సమయంలో జనసైనికులు చేసిన సేవలు వివరించి, ప్రజలకు అన్యాయం జరిగితే తమ జన సైనికులు ఎన్నటికీ ఊరుకోరని పోరాడి ఆ సమస్యను సాధించేవరకు వదిలిపెట్టరని ప్రజల యొక్క ఆశీస్సులతో కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేస్తాం అని అన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-29-at-14.00.26.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-29-at-14.00.28-1024x769.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-29-at-14.00.27-1-1024x769.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-29-at-14.00.28-1-1024x473.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-29-at-14.00.25-709x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-29-at-14.00.29.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-29-at-14.37.30.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-29-at-14.00.29-1-1024x714.jpeg)