కోళ్లబైలు పంచాయతీలో జగనన్న కాలనీలను సందర్శించిన రాందాస్ చౌదరి

మదనపల్లి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మదనపల్లి నియోజకవర్గంలో కోళ్లబైలు పంచాయతీలో జగనన్న కాలనీలను రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యాకర్తలతో కలసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పేదల రక్తం తాగుగుతున్నారని ఒక చిన్న స్థలంలో 5 నుండి 6 యూనిట్ లలో ఇంటి నిర్మాణం చేయాలనీ అంటున్నారు. కొండ, గుట్ట, గుంత, ప్రాంతంలో రోడ్లు కూడా వేయకుండా ఇంటి స్థలము మంజూరు చేసి ఇల్లు కడితే విడతల వారిగా ₹1,80,000 డబ్బులు ఇస్తాము అని నిర్మాణం చెయ్యండి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే ఒక్కో యూనిట్ ఇప్పుడు ఉన్న రేట్లని బట్టి చూస్తే దాదాపు 2లక్షలు ఖర్చు అవుతుంది. 6 యూనిట్స్ అంటే సుమారు 10 నుండి 12 లక్షలు కావాలి. మిగిలిన డబ్బులు అంత అప్పు చేసి నిర్మాణం చేపట్టాలి. బిల్లులు పెట్టాలంటే పనులు చేసి చూపించాలి డబ్బులు లేక వడ్డీలకు తెచ్చి కన్నీటి పర్వంతో ఇంటి నిర్మాణం చెప్పటవలసిన పరిస్థితి ఉందన్నారు. కట్టక పోతే ఇచ్చిన స్థలము వాపసు తీసుకొంటాము అని వాలంటీర్లు బెదిరిస్తున్నారు. అటు మన ముఖ్యమంత్రి అప్పులు చేసి ఇటు ప్రజలు అప్పులు చేసి రాష్ట్రము అప్పుల పాలు అవుతుంది. ప్రజలు అప్పులు చేసి బాధపడుతున్నారని అన్నారు. దీనిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. జనసేన ప్రభుత్వం రాగానే దీనికి మంచి పరిష్కారం చూపించే విధంగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళతాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్, రాష్ట్ర చేనేత విభాగ నాయకులు అడపా సురేంద్ర, ఐటీ విభాగ నాయకులు జగదీష్, మోహన, రెడ్డి శేఖర్ రెడ్డి, కుమార్, లవన్న, రాజారెడ్డి, రవి కుమార్ నాయుడు, మోహన, నవాజ్, రెడ్డెమ్మ, జంగాల గౌతమ్, శేఖర, అర్జున, నక్కలదీన్నే జయ, కత్తుల రెడ్డెప్ప, రవికుమార్, జై, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.