మదనపల్లిలో సోమవారం కోర్టుకు హాజరైన అఖిలపక్ష నాయకులు

మదనపల్లిలో అఖిలపక్ష నాయకులు సోమవారం కోర్టుకు హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ ఎంతో చారిత్రాత్మక నైపుణ్యం ఉన్న మదనపల్లిని జిల్లాగా చేయాలని అఖిలపక్షంతో కలిసి చేసిన అందోళనలను ఈ వైసీపీ ప్రభుత్వం నిరూపయోగం చేసిందని కనీసం చర్చలకు కూడా పిలవకుండా ఎకపక్షంగా వ్యవహరించిందని మదనపల్లి, వాయల్పాడు, తంబళ్ళపల్లి, పీలేరు, పుంగనూరు నియోజకవర్గ ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఈ వైసీపీ ప్రభుత్వంకి తగిన బుద్ది చెప్పాలని నిర్ణయించుకొన్నారని అన్నారు. అలాగే ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన 27 ఆఫ్ 2023 యాక్ట్ ని రద్దు చేయాలని సివిల్ కోర్టులో ఉంటే ప్రజలకు న్యాయం చేకూరుతుందని సివిల్ కోర్టు నుండి తీసివేసి రెవెన్యూ అధికారులకు పట్టం కట్టారు కాబట్టి రెవెన్యూ అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిడులకు లోనవుతుంది కాబట్టి ఆ యాక్ట్ వెంటనే రద్దు చేసి ప్రజలకు, న్యాయవాదులకి న్యాయం చేయాలనీ అఖిలపక్షం తరుపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జె వెంకటేష్, పీటీఏమ్ శివప్రసాద్, టీడీపీ రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు సురేంద్ర యాదవ్, టీడీపీ రైతు ప్రధాన కార్యదర్శి రాటకొండ మధుబాబు, సిపిఐ కృష్ణప్ప, సిపిఎం మురళి తదితరులు పాల్గొన్నారు.