ఘనంగా రావుల సాయి కృష్ణ జన్మదిన వేడుకలు

రామగుండం నియోజకవర్గం: జనసేన పార్టీ సీనియర్ నాయకులు రావుల సాయి కృష్ణ జన్మదినం సందర్భంగా శనివారం నియోజకవర్గ జనసైనికుల ఆధ్వర్యంలో రావుల జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వేడుకలలో భాగంగా రామగుండం నియోజకవర్గ జనసైనికులు స్థానిక గోదావరిఖని లోనీ అమ్మ పరివార్ ఆశ్రమంలో పిల్లల మధ్య కేక్ కట్ చేసి, ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. అనంతరం గోదావరిఖని వంద పడకల ఆసుపత్రిలో అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకి ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. అనంతరం రామగుండం పట్టణ జనసైనికులు రామగుండంలోని తబిత ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రామగుండం మండలం ప్రధాన కార్యదర్శి ఎముర్ల రంజిత్ మాట్లాడుతూ.. రావుల సాయి క్రిష్ణ అన్నయ్య మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుని ఆశీస్సులు మీకు ఉండాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం నాయకులు మోతే రవికాంత్, బండారు తిరుపతి, ఎడ్ల లోకేష్, గడ్డం సురేష్, మంథని మధు, బొడ్డు మనోజ్ తదితరులు పాల్గొన్నారు.