కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో జగనన్న కాలనీ సోషల్ మీడియా క్యాంపెయిన్

  • పొన్నలూరులో వైసీపీ నాయకులు సొంత ఇంట్లో నిద్రపోతున్నారు, పేదలు మాత్రం ఇల్లులేక నిద్రపోలేకపోతున్నారు
  • పొన్నలూరులో జగనన్న కాలనీలు ఎక్కడ ? ఒక్క ఇంట్లో అయినా గృహప్రవేశం జరిగిందా?
  • జగనన్న కాలనీలు పేరు చెప్పుకొని జేబులు నింపుకున్న పొన్నలూరు వైసీపీ నాయకులు

కొండపి నియోజకవర్గం: పొన్నలూరు మండలంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో జగనన్న కాలనీల పరిస్థితులపై జనసేన పార్టీ సోషల్ మీడియా క్యాంపెయిన్ జరిగింది.
పొన్నలూరు మండలంలో ఉన్నటువంటి ఏ ఒక్క గ్రామంలో కూడా ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించి ఇచ్చిన పాపాన పోలేదు, పొన్నలూరు మండలం మొత్తం మీద 40 నుండి 50 ఇల్లు వరకు ఇంటి నిర్మాణంలో ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఒక్క ఇంట్లో కూడా గృహప్రవేశం జరగలేదు. జగనన్న కాలనీలు చెట్లు, వాగులు, వంకలు, స్మశానాలతో, లోతట్టు ప్రాంతాల్లో చెరువుల దగ్గర పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. పేరుకు మాత్రమే కొన్నిచోట్ల జగనన్న కాలనీలు ఉన్నాయి. జగనన్న కాలనీలు అనేవి మన ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద స్కాం, రాష్ట్రం మొత్తం మీద 30 లక్షల ఇల్లు నిర్మించి పేదలకు ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, కనీసం పొన్నలూరు మండలంలో ఒక్క ఇల్లు కూడా పూర్తిస్థాయిలో పేదవాడికి కట్టించి గృహప్రవేశం చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు, జగనన్న కాలనీలు పేదవాడికి కన్నీళ్లుగా మారిపోయాయి. ప్రభుత్వమే ఇల్లు లేని పేదవారికి ఇల్లు నిర్మిస్తాము అని చెప్పి, ఇప్పుడు మాత్రము ఆ లబ్ధిదారుడే ఇంటి నిర్మాణం చేసుకోవాలి లేకపోతే మీ ఇంటి పట్టా రద్దు చేస్తాము అని పొన్నలూరులో వైసిపి నాయకులు మరియు గ్రామాల్లో ఉన్న వాలంటీర్లు పేదవారిని బెదిరిస్తున్నారు. పొన్నలూరులో ఉన్నటువంటి వైసీపీ నాయకులు జగనన్న కాలనీలు పేరు చెప్పుకొని జేబులు మాత్రం నింపుకున్నారు, లబ్ధిదారులకు మాత్రం ఇప్పటివరకు న్యాయం జరగలేదు అని కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు.