జగనన్న కాలనీని సందర్శించిన చిల్లపల్లి

  • జగనన్న ఇల్లు – పేదలందరికి కన్నీళ్లు
  • జనావాసాలకు దూరంగా జగనన్న కాలనీలు
  • ఎటువంటి మౌళిక సదుపాయాలు లేకుండా జగనన్న కాలనీలు

మంగళగిరి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగనన్న కాలనీల పరిస్థితిపై జనసేన సోషల్ మీడియా క్యాంపెయిన్ కార్యక్రమం శనివారం మంగళగిరి నియోజకవర్గం, దుగ్గిరాల మండలం, పెద్ద కొండూరు శివారులో ఉన్న జగనన్న కాలనీని మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు జనసేన పార్టీ నాయకులు పరిశీలించి అక్కడ పరిస్థితులను ప్రభుత్వ పనితీరును తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ…
★ సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ ఇల్లు అంటూ లక్షల మందికి ఇచ్చామంటూ ప్రచారం చేయడం తప్ప పేదలకు చేసిందేమీ లేదు.
★ 2020లో అంటే దాదాపు మూడు సంవత్సరాల క్రితం శిలాఫలకం పెట్టడం జరిగింది. ఈ రోజున చూస్తుంటే చిన్నపాటి వర్షాలకే ఆ శిలాఫలకం కూడా నీళ్లలో మునిగి ఉంది. దీన్ని చూస్తేనే అర్థమవుతుంది.
★ దాదాపు 120 ఇల్లు మంజూరు కాగా కేవలం 10 ఇల్లు మాత్రమే నిర్మాణ స్థితిలో ఉన్నాయి.
★ జగనన్న కాలనీలో అని జనావాసం లేని, రోడ్డు సౌకర్యం, నీటి సౌకర్యం మౌళిక సదుపాయాలు లేని విష సర్పాలు సంచరించే పొలాల మధ్యలో, గుట్ట ప్రాంతంలో పేదలకు ఇల్లు నిర్మించి, కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు.
★ మీరేమో ప్యాలెస్ లో కూర్చొని పరిపాలించొచ్చు గాని పేద ప్రజల ఓట్లు మాత్రం కావాలి కానీ ప్రజలకు కావలసిన మౌళిక సదుపాయాలు కూడా మీరు కనిపించలేకపోతున్నారు.
★ జగనన్న కాలనీలా పరిస్థితి ఎలా ఉందో ఒకరోజు వచ్చి చూసి ఒక రోజు ఇక్కడ ఉండండి. ఎంత దారుణంగా ఉందో మీకు కూడా అర్థమవుతుంది. మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు చెప్పారు కదా ప్రజల పక్షాన ఉంటానని
★ కేవలం మీ లబ్ధి కోసమే జగనన్న కాలనీలు నిర్మిస్తున్న పొలాలు రైతుల దగ్గర కొని వేల కోట్లు స్కామ్ చేస్తున్నారు ఈ వైసీపీ నాయకులు
★ ఈ కాలనీ చూస్తుంటే మోకాళ్ళ లోతు నీళ్లు ఒక చెరువులాగా ఉందని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వారు కళ్ళు తెరిచి పేదలకు కట్టించిన ఇళ్లకు వచ్చి ఒకసారి చూసి వాళ్లకి ఎలాంటి మౌళిక సదుపాయాలు కావాలో కల్పించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, గుంటూరు జిల్లా కార్యదర్శి రావిరమా, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, ఎంటిఎంసి అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (జే.ఎస్.ఆర్), దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు (ఎస్.ఎన్.ఆర్), ఎంటిఎంసి జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు-కాపు సంక్షేమ సేన మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు తిరుమలశెట్టి కొండలరావు, ఎంటిఎంసి కార్యదర్శులు బళ్ళ ఉమామహేశ్వరరావు, కట్టెపోగు సురేష్, తాడేపల్లి మండల ఉపాధ్యక్షులు తంబి, మంగళగిరి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు తుమ్మపుడి నరసింహరావు(చంటి), తాడేపల్లి మండల ప్రధాన కార్యదర్శి లాల్ చంద్, మంగళగిరి మండల ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి కిషోర్, నూతక్కి గ్రామ అధ్యక్షులు మారెళ్ళ రమేష్, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి, మంగళగిరి పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్, చిల్లపల్లి యూత్ సభ్యులు బేతపూడి దీపక్, జనసేన నాయకులు గురజాల దుర్గా ప్రసాద్, గోపిశెట్టి సురేష్, గోపిశెట్టి శ్రీను, గడ్డం సురేష్, నారిశెట్టి శ్రీధర్, రామిశెట్టి సాయి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.