జిల్లాలో ఒక ఇల్లు కూడా మంజూరు చేయలేదు: డా. గంగులయ్య

  • అరకు జనసేన ఆధ్వర్యంలో జగనన్న కాలనీ సోషల్ మీడియా క్యాంపెయిన్

పాడేరు నియోజకవర్గం: జనసేన పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జగనన్న కాలనీ ఫెయిల్యూర్ సోషల్ ఆడిట్ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ చేస్తున్న సోషల్ ఆడిట్ జగనన్న కాలనీ విషయంలో విస్తుపోయే వాస్తవాలు బయటకొస్తున్నాయని డా. వంపూరు గంగులయ్య అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ అల్లూరీ జిల్లాలో జగనన్న కాలనీ నిర్మాణం ఎక్కడా కూడా లేదని రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అక్కడక్కడ అసంపూర్తిగా, నిర్మాణం చేపట్టిన గృహాలకు బిల్లులు సక్రమంగా లేకపోవడం చూస్తే ప్రభుత్వం ప్రజల గృహానిర్మాణంపై ఎంతటి నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందో తెలుస్తుందని పేర్కొన్నారు. ఇక అల్లూరీ జిల్లాకి సంబంధించిన విషయాన్ని పరిశీలిస్తే కఠోర వాస్తవాలు బయటపడుతుంది. జిల్లాలో బ్రహ్మాండమైన ఘనమైన చరిత్ర సృష్టించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే చెందుతుందని ఈ సందర్బంగా తెలియజేయాలి. మేము జనసేన పార్టీ అధినేత పిలుపుమేరకు జగనన్న గృహకల్పన పథకాన్ని పరిశీలించగా వాటి పూర్వపరాలు ఆరతీయగా జిల్లాలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని తెలిసింది. స్థానిక ప్రజాప్రతినిధులు ఆర్భాటలలో ముందున్నారు, పార్టీ ప్రచారంలో ముందున్నారు, ముఖ్యమంత్రి గారికి మేళతాళాలతో చేసే భజనలో ముందున్నారు. కానీ ప్రజాసమస్యలపై ఆలోచన చేయకపోగా అమాయక గిరిజనులను మభ్యపెడుతూ కాలయాపన చేస్తూ పదవులను తీరికగా ఎంజాయ్ చేస్తున్నారు. గడప గడపకి మన ప్రభుత్వమని తిరిగే ప్రజాప్రతినిధులు ఎన్ని గడపలు నిర్మాణం చేశారో చెప్పాలి. నిజంగానే ఈ విషయం మీకు తెలియదా ఎంపీ, ఎమ్మెల్యేలు సమాధానం చెప్తారా లేక మా నాయకత్వ తీరు ఇదేనని ఒప్పుకుంటారా? సమాధానం చెప్పాలని హెచ్చరించారు. మీరు సమదానం చెప్పకపోవచ్చు, దాట వేయవచ్చు, కానీ బారి మూల్యం చెల్లించుకునే రోజులున్నాయని గ్రహించాల్సి ఉంటుందని ఈ సందర్బంగా తెలియజేస్తున్నామన్నారు. మా అధినేత జగనన్న కాలనీ మీద సోషల్ ఆడిట్ చెయ్యమని ఆదేశిస్తే మాకు సోషల్ ఆడిట్ చెయ్యడానికి ఒక్క గృహం కూడా లేకపోవడం చూస్తే మన ప్రజాప్రతినిధుల నాయకత్వంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. అసలు జగనన్న కాలనీల ద్వారా ఇల్లు నిర్మాణం మంజూరు చేయకపోగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం కింద మంజూరు చేసిన ఇళ్లని తామే మంజూరు చేశామని మభ్యపెట్టడం ఆదివాసీలకు మోసం చేయడమేనని అన్నారు. ఈ పరిస్థితిని చూస్తే ప్రభుత్వం అవినీతికి పేదోడి ఇల్లుకి గొప్ప సంబంధమే కుదిర్చారని ప్రభుత్వాన్ని విమర్శించారు. మండల అధ్యక్షులు మసాడి భీమన్న, ఈశ్వర్రావు, తాంగుల రమేష్, అంకిత్, తల్లే త్రిమూర్తి మస్తాన్, అఖిల్, తెరవాడ బాలకృష్ణ, సత్యరావు, శ్రీకాంత్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.