కీర్తనపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అలిపిరి పి.ఎస్ లో కేసు నమోదు

తిరుపతి: జనసేన పార్టీ అధికార ప్రతినిధి కీర్తనపై బుధవారం ఓ టీవీ ఛానల్ డిబేట్లో వైసిపి నేత చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ మరియు ముఖ్య నేతలు గురువారం సాయంత్రం అలిపిరి పోలీస్ స్టేషన్ వద్ద ఎ ఎస్పీ కి సంబంధిత వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.