Pendurti: పవన్ కళ్యాణ్ పర్యటన నిమిత్తం మీడియా మిత్రులతో సమావేశం

జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి, పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ తమ్మిరెడ్డి శివశంకరరావు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పర్యటన నిమిత్తం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పలు దఫాలు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి వారు శ్రీ పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ వద్దకు వచ్చి మా యొక్క పోరాటానికి మద్దతు తెలిపినట్లయితే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది అనే నమ్మకం మాలో ఉంది, ఈ సమస్యను మీరు టేకప్ చేసినట్లయితే మేము విజయం సాధిస్తామని పలుమార్లు జనసేనపార్టీ నాయకత్వానికి తెలియజేయగా అక్టోబర్ 31 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ వద్ద బహిరంగసభ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెట్టడం జరుగుతుంది, ఈ విషయాన్ని మీడియా సోదరులు బాధ్యతగా తీసుకొని ప్రజలలోకి తీసుకొని వెళ్ళాలని కోరడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొట్టమొదటగా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ కు వినతిపత్రం ఇచ్చి, స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకు గుండెకాయ లాంటిదని సెంటిమెంట్ తో కూడుకొని ఏర్పాటుచేయడం జరిగిందని, ఈ యొక్క కర్మాగారాన్ని లాభనష్టాలతో చూడకూడదని పెద్దలకు విన్నవించడం జరిగింది, అధ్యక్షులు సూచన మేరకు పలు దఫాలు జిల్లా జనసేనపార్టీ కార్యవర్గం కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యోగస్తులు భూనిర్వాసితులకు నిర్వహించిన ధర్నాలో కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమస్య వచ్చిన వెంటనే స్పందించిన మనసున్న శ్రీ పవన్ కళ్యాణ్ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకోసం వస్తున్నా మనమందరం కూడా బాధ్యతగా ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంచుకోవాలని మీడియా సోదరులును కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కంచిపాటి మధు, పెన్నంటి పార్వతి, వబ్బిన శ్రీకాంత్, తనకాల శ్రీనివాస్, జుత్తడ శ్రీనివాస్, కోరుకొండ వరహాలు, శేఖర్, చైతన్య, రామారావు, మల్లు నాయుడుపాలెం రవి, కర్రి కనకరాజు, విష్ణు, సన్యాసిరాజు, శంకర్, ఆరిజిల్లి అప్పలరాజు, మరియు జనసైనికులు పాల్గొన్నారు.