కరోనా మృతుల కుటుంబాలకు 15వేలు… ప్లాస్మా దాతలకు 5వేలు: జగన్ సర్కార్ జీవో జారీ

ఏపి ముఖ్యమంత్రి జగన్ కరోనా మృతుల కుటుంబాలకు సాయం చేస్తాo అని అలాగే ప్లాస్మాను దానం చేసిన వారికి 5 వేలు ప్రోత్సాహకంగా అందిస్తాo అని  ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జీవో జారీ చేశారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.15వేలు ఇవ్వనున్నారు.. ఇందుకోసం ఆయా జిల్లా కలెక్టర్లకు రూ.12 కోట్లు విడుదల చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌‌ను ఆదేశించారు. వెంటనే నిధులు విడుదల చేయాల్సిందిగా ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే ప్లాస్మాను దానం చేసిన వారికి ఐదు వేలు అందివ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్లాస్మా థెరపీపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించి దీనిని ప్రోత్సహించాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ సూచించారు. ప్లాస్మా దానం చేసే వారికి రూ. 5,000 ప్రోత్సాహకంగా ఇవ్వాలని ఆదేశించారు. ఈ డబ్బు వారు మంచి భోజనం తీసుకునేందుకు ఉపయోగపడుతుంది అన్నారు. చెప్పినట్లుగానే జీవో కూడా జారీ చేశారు.