జనసైనికుడు పులి పవన్ కు ప్రమాద భీమా చెక్కు అందజేత

పెద్దపల్లి నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాజలింగంల సూచనల మేరకు పెద్దపల్లి నియోజకవర్గ క్రియాశీలక వాలంటీర్ రాసురి హరికృష్ణ ఆధ్వర్యంలో బుధవారం ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడిన క్రియాశీల జనసైనికుడు పులి పవన్ కు 50,000 రూపాయలు చెక్కుని అందజేయడానికి వచ్చిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నియోజకవర్గం ఇన్చార్జి బెక్కం జనార్ధన్, హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి తగరపు శ్రీనివాస్, మంథని నియోజకవర్గ ఇన్చార్జి మాయ రమేష్, మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు చల్ల శివారెడ్డి, కందుకుల రాజిరెడ్డి, కాసరాజు, పడాల ప్రసాద్, చిట్టి ఉదయ్ కుమార్, సంఘభట్ల వినయ్ ల సమక్షంలో పులి పవన్ కు 50 వేల రూపాయల చెక్ అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి నియోజకవర్గం జనసేన నాయకులు లొల్లిశివ, ఈర్ల అజయ్, పెర్క నీరజ్, వడ్లకొండ శ్రీకాంత్, పున్నసతీష్, జెట్టిసాగర్, జెట్టి శ్రీకాంత్, దాడి అనిల్, వినయ్, సాయి తదితరులు పాల్గొన్నారు.