ప్రతి కార్యకర్తకి వారి కుటుంబానికి అండగా ఉండటమే జనసేన ముఖ్య ఉద్దేశం: గాదె

గుంటూరు జిల్లా, గుంటూరు టౌన్ లో ఎ. టి అగ్రహారం నందుగల 29, 30,31 డివిజన్ల అధ్యక్షులు పసుపులేటి నరసింహారావు, మధులాల్, దాసరి వెంకటేశ్వరరావు ల అధ్యక్షతన ఏర్పాటు చేసిన క్రియాశీలక కిట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర జెనరల్ సెక్రటరీ బొనబోయిన శ్రీనివాస్ యాదవ్, గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి నాయుబ్ కమల్, నగర అధ్యక్షులు నేరేళ్ల సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు పాల్గొని క్రియాశీలక కార్యకర్తలకు కిట్లను పంపిణీ చేశారు. అలాగే గత నెలలో పార్టీ కార్యకర్తలు ఇద్దరు కట్టా సురేష్, ఓట్ల కిషోర్ బైక్ యాక్సిడెంట్ కి గురైనారు వారికి 3 నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ.. మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశమే జనసైనికులకు ఎటువంటి ప్రమాదం జరిగినా వారికి, వారి కుటుంబానికి అండగా ఉండాలని మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వాలను తీసుకురావటం జరిగింది. కాబట్టి పార్టీలో పని చేసిన, చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త ఈ క్రియాశీలక సభ్యత్వాలను తీసుకోవాలని కోరారు.