ఎర్నాపాలెంలో పర్యటించిన జనసేన నాయకులు

పాడేరు నియోజకవర్గం: చింతపల్లి మండలం, ఎర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కారణంగా నిర్వాసితులయ్యే 32 గ్రామాలను జనసేన పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్బంగా ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ అక్కడ వాస్తవ పరిస్థితులపై వారితో మాట్లాడి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎర్నాపాలెం గ్రామస్తుల ఆహ్వానం మేరకు అక్కడ సమావేశం ఏర్పాటు చేసి వారితో ప్రస్తుత పరిస్థితులపై చర్చిండం జరిగింది. జనసేన పార్టీ నాయకులు మసాడి భీమన్న, లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించడమంటే అమాయక గిరిజన ప్రజలపై ఊచకోత కోయడమేనని వైసీపీ ప్రభుత్వం తమ స్వార్థపూరిత ఆలోచనా విధానాలతో గిరిజన సహజ సంపదపై వారి బ్రతుకులపై కక్ష్యగట్టడమేనని అన్నారు. జనసేన పార్టీ ప్రకృతి సంరక్షణ బాధ్యత తీసుకుంటుందని, గిరిజన ప్రజలకు జనసేన పార్టీ ద్వారా మాత్రమే రక్షణ లభిస్తుందని లేదంటే ఈ బూర్జువా రాజకీయ పార్టీలు తమ అధికారం కోసం ఎంతకైనా తెగిస్తుందని అన్నారు. ఈ సంధర్బంగా ఎర్నాపాలెం గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా మేము జనసేన పార్టీని నమ్ముతున్నామని జనసేనాని పవన్ కళ్యాణ్ సేవలను చూస్తున్నామని, ఒక సారి అధికారం ఇస్తే మేలు చేస్తాడని గ్రామస్తులు తెలిపారు. ఎర్నాపాలెం గ్రామ ప్రజలు జనసేన పార్టీలో చేరారు. లీగల్ అడ్వైజర్, కిల్లో రాజన్, మసాడి భీమన్న పార్టీ కండువాలు కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు.