కాల్వ రాజశేఖర్ అధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ

మంథని నియోజకవర్గం: భారత 77వ స్వతంత్ర వేడుకను పురస్కరించుకొని మంగళవారం మహాదేవపూర్ పట్టణంలో జాతీయ పతాకాన్ని జనసేన పార్టీ మండల అధ్యక్షులు కాల్వ రాజశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాల్వ రాజశేఖర్ మాట్లాడుతూ.. నియోజక వర్గ ప్రజలకు తోటి జనసేన నాయకులకు, శ్రేణులకు శుభాకాంక్షలు తెలియచేశారు. 76 వసంతాల స్వతంత్ర భారతంలో పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలతో సమ న్యాయం సగటు మనిషికి చేరే వరకు జనసేన తోడుంటుందని చెప్పారు. ఉద్యమాల నేలలో పుట్టిన మనం మన హక్కుల కోసం ఇంకా పోరాటం చెయ్యడం భాద అనిపించినా రేపటి భావితరాల కోసం మలి పోరాటం చెయ్యడానికి ఎప్పుడు జనసేన పార్టీ ముందుంటుందని చెప్పారు. ప్రజల చేత ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు జవాబుదారీతనంతో వుండాలి అని తెలిపారు. రేపటి మంచి సమాజం కోసం పోరాటం చేస్తున్న వారు సుభాష్ చంద్ర బోస్ను ఆదర్శంగా తీసుకొని అవినీతి లేని భారత దేశాన్ని రేపటి పౌరులకు అందిద్దాం అని చెప్పారు. అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఓటు అనే ఆయుధాన్ని అందించారు. ఆయన ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు, అంటరాని కులానికి న్యాయం చేయడం వలన చాలామంది ఎస్సీ, ఎస్టీ కులాలకి అంకితం చేస్తున్నారు, అది తప్పు ఎందుకంటే ఆయన బానిసత్వాన్ని అంతం చేయడం కోసం తన అక్షరాన్ని ఓటుగా మలిచాడు కానీ దానికి నేడు ఓటుకు బానిసై నోటు తీసుకొని మన గ్రామాన్ని, మన నియోజకవర్గాన్ని మన రాష్ట్రాన్ని కాదు కదా మన దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు అని కొనియాడారు. అలాగే గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం చేశారు. అహింసా మార్గంలో శాంతియుతంగా పోరాడారు. హింసతోటి సాధించలేనిది అహింసతో సాధించవచ్చు సహనంతో ఉండాలి అని చెప్పారు. ఆయన సిద్ధాంతం అది అని కొనియాడారు. అలాగే అల్లూరి సీతారామరాజ్ బడుగు బలహీన వర్గాల గిరిజనులకు చైతన్యం కల్పించారు. గిరిజనులు ఆదివాసులకి అగ్నికణంగా మారి విప్లవాన్ని రగిలించాడు. అడవి జాతి మనుషులను ఆస్త్రాలుగా తయారుచేసిన మహాయోధుడు అని కొనియాడారు. మరొక్క మహానీయుడు భగత్ సింగ్ నేటి యువతను చైతన్యంలోకి తెచ్చిన మహాయోధుడు ఆయన తన చిన్న వయసులోనే ఉరిశిక్ష వేసుకున్నాడు. ఎందుకంటే నేటి యువత కోసం రాబోవు తరాల కోసం పౌరుషం నింపడం కోసం ఉరిశిక్ష తీసుకున్నాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ మండల ప్రధాన కార్యదర్శి శేషోజ్వాల రాజేష్, నారా రవికాంత్, రామ్ శెట్టి రాకేష్ కుమార్, కడార్ల రాజేష్, బుర్రి రాకేష్, చిర్ర రాకేష్, గణేష్, జమీల్, అంబాల రాజకుమార్ అంబాల సంతోష్ విష్ణు శివాజీ తదితరులు పాల్గొన్నారు.