బెల్ట్ షాపులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: గుడివాక శేషుబాబు

  • మద్య నిషేధం హామీతో మహిళలను నమ్మించి గెలిచిన జగన్ పాలనలో మద్యం ఏరులై పారుతోంది
  • జగన్ హామీలు అడ్డుపెట్టుకొని గెలిచిన అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు నియోజకవర్గంలో రూట్ల వారీగా ఏజెంట్లను కేటాయించి బెల్ట్ షాపులు కొనసాగిస్తున్నారు
  • బెల్ట్ షాపుల్లో వాటాలు దండుకుంటున్నారు
  • మద్యం బెల్ట్ షాపుల వ్యవహారంపై ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యే ఇద్దరూ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలి
  • బెల్ట్ షాపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని శేషుబాబు డిమాండ్
  • నియోజకవర్గంలో ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయో చెప్పమంటారా?
  • మోపిదేవి మండలం కొత్తపాలెంలో ఇద్దరు బెల్ట్ షాప్ నిర్వాహకులు కత్తులతో దాడులు చేసుకుని ఆసుపత్రుల్లో ఉన్నారు
  • ఇది మరువక ముందే అవనిగడ్డ మండలం మోదుమూడిలో అధికార పార్టీ నాయకుడు నాటుసారా తయారు చేసి విక్రయిస్తూ పట్టుబడ్డాడు
  • అధికార పార్టీ నాయకులు చివరికి ఈ స్థాయికి దిగజారిపోయారు
  • నియోజకవర్గంలో బెల్ట్ షాపులు తొలగించకపోతే జనసేన ఆధ్వర్యంలో బెల్ట్ షాపుల నిర్వాహకులను పోలీసులకు అప్పగిస్తాం
  • జనసేన నేత గుడివాక శేషుబాబు ఘాటు వ్యాఖ్యలు

అవనిగడ్డ నియోజకవర్గం: మద్య నిషేధం హామీతో మహిళలను నమ్మించి గెలిచిన జగన్ పాలనలో మద్యం ఏరులై పారుతోందని జనసేన పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ నాయకులు గుడివాక శేషుబాబు అన్నారు. జగన్ హామీలు అడ్డుపెట్టుకొని గెలిచిన అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు నియోజకవర్గంలో రూట్ల వారీగా ఏజెంట్లను కేటాయించి బెల్ట్ షాపులు కొనసాగిస్తూ వాటాలు దండుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మద్యం బెల్ట్ షాపుల వ్యవహారంపై ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యే ఇద్దరూ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని, శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయో చెప్పమంటారా అని ప్రశ్నించారు. మోపిదేవి మండలం కొత్తపాలెంలో ఇద్దరు బెల్ట్ షాప్ నిర్వాహకులు కత్తులతో దాడులు చేసుకుని ఆసుపత్రుల్లో ఉన్నారని, ఇది మరువక ముందే అవనిగడ్డ మండలం మోదుమూడిలో అధికార పార్టీ నాయకుడు నాటుసారా తయారు చేసి విక్రయిస్తూ పట్టుబడటం అధికార పార్టీ నాయకులు ఏ స్థాయికి దిగజారిపోయారన్నారు. నియోజకవర్గంలో బెల్ట్ షాపులు తొలగించకపోతే జనసేన ఆధ్వర్యంలో బెల్ట్ షాపుల నిర్వాహకులను పోలీసులకు అప్పగిస్తామని ప్రకటించారు.