రామ్ చరణ్ జన్మదిన వారోత్సవాలు సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమము

అంబాజీపేట: గ్లోబల్ స్టార్ కొణిదెల రామ్ చరణ్ జన్మదిన వారోత్సవాలలో భాగంగా 3వ రోజు గురువారం అంబాజీపేటలో హైస్కూల్ నందు మజ్జిగ పంపిణీ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. కోనసీమ రామ్ చరణ్ యువశక్తి ఇంఛార్జి మంచాల నోకేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాచవరం గ్రామపంచాయతీ సర్పంచ్ నాగబుత్తుల శాంతి కుమారి సుబ్బారావు, అంబాజీపేట మండల జనసేన పార్టీ అధ్యక్షులు దొమ్మేటి సాయి కృష్ణ, పత్తి దత్తుడు, మహిపాల తాతాజీ, అంబాజీపేట మండల రామ్ చరణ్ ఫాన్స్ అసోసియేషన్ బోనగిరి భూషణ్ నాయుడు, తోట బాబీ, వారే తేజ, రమేష్ సూదాబత్తుల, యర్రంశెట్టి నాగేంద్ర, రవణం విజయ్, శీరగం జగత్, మెడిది సుమంత్, అరిగెల శివ కళ్యాణ్, పవన్ తులసి, కురస నాయుడు, పల్ల తేజ, పెరబత్తుల అజయ్, నందేపు శీను, బంధన రంగ, పళ్ల రాము, రంకిరెడ్డి రఘురామ్, క్రప దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.