రాజోలు జనసేన ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

రాజోలు, సినీవినీలాకాశంలో మకుటంలేని మహారాజులా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు మంగళవారం రాజోలు జనసేన నాయకులు కోళ్ళ బాబి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలలో భాగంగా రాజోలు జనసేన నాయకులు కోళ్ళ బాబి ఆధ్వర్యంలో రాజోలు ప్రభుత్వాసుపత్రిలో మొదటగా రక్తదాన కార్యక్రమం నిర్వహించి అనంతరం ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు బ్రెడ్ మరియు ఫ్రూట్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజోలు జనసేన పార్టీ మండలాధ్యక్షులు సూరిశెట్టి శ్రీను, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, శతఘ్ని న్యూస్ వ్యవస్థాపకులు నాయుడు నిమ్మకాయల, రాజోలు జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.