గుడ్ మార్నింగ్ సీఎం సార్.. రోడ్ల అభివృద్ధి ఎక్కడ: సిద్ధవటం జనసేన

*గుడ్ మార్నింగ్ సీఎం సార్.. రోడ్ల అభివృద్ధి ఎక్కడ.. జనసైనికులు ఆగ్రహం

*రోడ్లు అన్నీ గుంతల మయం.. ప్రజల అష్టకష్టాలు తెలియదా

సిద్ధవటం: కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, సిద్ధవటం మండల హెడ్ క్వార్టర్స్ లో ఆదివారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు గుడ్ మార్నింగ్ సీఎం సార్ రోడ్ల గుంతలపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజలు పడుతున్న కష్టాలు అధిక ఇసుక వాహనాలు వల్ల దెబ్బతిన్న రోడ్ల పై జనసైనికులు పర్యటించారు. రోడ్ల అభివృద్ధి చేస్తామని చెప్పిన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఇంతవరకు రోడ్ల అభివృద్ధి చేయలేదని కేవలం మాటలు తప్ప రాష్ట్రంలో అభివృద్ధి లేదని 108 వాహనం వెళ్లాలన్నా కూడా రోడ్ల గొంతులతో అవస్థలు పడుతున్నారని జనసైనికులు మండిపడ్డారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర కార్యదర్శి రామయ్య మాట్లాడుతూ గుడ్ మార్నింగ్ సీఎం సార్ రోడ్ల గుంతలతో సిద్ధవటం మండలంలో రోడ్ల అభివృద్ధి చెందగా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. సిద్ధవటం ప్రధాన రహదారి ఎక్కడ చూసినా గుంతల మయం తప్ప ఇంకొకటి లేదని.. అధిక ఇసుక వాహనాల వల్ల రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నాయని.. ఓ మహిళ జనసైనికులు దృష్టికి తీసుకెళ్లింది. ఇసుక వాహనం వల్ల మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయబ్రాంతులకు గురవుతున్నామని.. రోడ్లు అధిక గుంతలు ఉన్నాయని జనసైనికులు దృష్టికి తెలియజేశారు. సిద్ధవటం మండలం జనసేన ఇంచార్జి కొట్టే రాజేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసంలో ఉంటూ.. హెలికాప్టర్లో వెళుతూ దళితులు అష్టకష్టాలు పడుతూ ఉంటే కేవలం ఇసుక, లిక్కర్ నందు పేద ప్రజల రక్తం పిండి సొమ్ము చేసుకుంటున్నారని.. సిద్ధవటం మండలంలో ఎక్కడ చూసినా గుంతల మయం తప్ప ప్రధాన రహదారి రోడ్డు వెడల్పు చెయ్యలేదని.. ఇకనైనా రోడ్లు అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు. సిద్ధవటం గ్రామపంచాయతీ 11వ వార్డ్ మెంబర్ పసుపులేటి కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిద్ధవటం మండలం జనసేన ఇంచార్జి కొట్టే రాజేష్, జనసేన చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి రాటాల రామయ్య, సిద్ధవటం గ్రామపంచాయతీ 12వ వార్డ్ మెంబర్ ఆవుల నాగరాజ, మోడెమ్ నాగరాజ, నవీన్ కుమార్, అల్లం శివ, అతికారి బాలు, గురు ప్రసాద్, అయ్యవారయ్యా, గుర్రయ్య, తాళ్లపాక శంకరయ్య, పోలిశెట్టి శ్రీనివాసులు జనసేన వీర మహిళలు తదితర జనసైనికులు గుడ్ మార్నింగ్ సీఎం ప్రోగ్రాంలో పాల్గొన్నారు.