ఏటుకూరులో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

గుంటూరు: తెలుగు సినిమా రంగంలో ప్రవేశించిన అనతి కాలంలోనే తన నటనా ప్రతిభను చాటుకోని మంచి పాత్రలతోటి మంచికధాంశాలతోటి ప్రేక్షకుల మన్ననలు పొందిన కష్టజీవి మెగాస్టార్ చిరంజీవి గారని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య అన్నారు. ప్రారంభంలో ఏన్నో ఆటుపోట్లను తట్టుకోని ఎలాంటి ప్రోత్సాహం లేకపోయినా తెలుగు సినిమాలో బ్రేక్ డాన్స్, డిస్కో డాన్స్ లతోటి కోత్త రకమైన ఫైట్స్, క్యాస్టూమ్స్, తదితర ఆంశాలతో తనకంటూ ఒక స్థానాన్ని తెలుగు సినిమా పరిశ్రమలో నిలిచిన మేరునగధీరుడు చిరంజీవేనని అన్నారు. కృషి పట్టుదల క్రమశిక్షణ ఆయనను శిఖరాగ్రానికి తీసుకువెళ్ళినారని వెంకటరత్తయ్య పేర్కొన్నారు. తాను ప్రేక్షకులకు నవరసాలు అందిస్తూ చిరంజీవి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడుగా 3సార్లు, ఏన్నో సార్లు ఫిలిం ఫేర్ అవార్డ్స్ సాధించిన ఏకైక నటుడు చిరంజీవి అని వెంకట రత్తయ్య అన్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, కరోనా సమయంలో ఆక్సీజన్ సీల్లెండర్లు తన సొంత నిధులతో ప్రజలకు మరియు పేద సిని కళాకారులను ఆదుకున్న మహోన్నతమైన మానవతావాది అని ఆయన బ్లడ్ బ్యాంక్ ద్వారా చేసిన సేవలను గుర్తించి పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న విలక్షణ నటుడు చిరంజీవేనని మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ సమస్యల్ని పరిష్కరించడానికి తన సహకారాన్ని ఆందిస్తూ తెలుగు సినిమా పరిశ్రమకు గాడ్ ఫాదర్ అయ్యారని వెంకటరత్తయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన గుంటూరు జిల్లా కార్యదర్శి ప్రతివాడ గంగాధరరావు, కాపు సంక్షేమ సేన యూత్ వింగ్ వర్కింగ్ అధ్యక్షులు బూరగడ్డ చిరంజీవి, కాపు సంక్షేమ సేన గుంటూరు యూత్ కార్యదర్శి బూరగడ్డ ఓం కోటేశ్వరరావు,యు. గంగరాజు, వాలీ సుగుణరావు, రాజన్, రవికాంత్, దాసరి వాసు, కోవా నాగార్జున, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.