మద్యపాన నిషేధం పేరుతో మహిళలను మోసం చేసిన జగన్ రెడ్డి

  • మహిళల ఆవేశం
  • ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ – జనసేన విజయ యాత్ర 51వ రోజు
  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం 51వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి మండలం, కాపు గున్నేరి పంచాయతీలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా. పెద్ద ఎత్తున మహిళలు మంగళ హారతులతో వినుత గారికి ఆహ్వానం పలికి ప్రచారం లో పాల్గొన్నారు. గ్రామాల్లో ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదుసుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరడం జరిగింది. చదువుకున్న యువత కి ఉద్యోగాలు లేవు, సి సి రోడ్డు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు, డ్రైనేజ్ కాలువల నిర్మాణం అస్సలు లేదని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని వినుత ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, పట్టణ అధ్యక్షుడు తోట గణేష్, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, నాయకులు కిషోర్, ముని కుమార్, వంశీ, తేజ, సురేష్, జన బాలు, బతేయ్యా తదితరులు పాల్గొన్నారు.