పవన్ పై అభిమానాన్ని చాటుకున్న అభిమాని
- పాల్వంచ మండలంలో జనంలోకి జనసేన
కొత్తగూడెం నియోజకవర్గం: పాల్వంచ మండలంలో జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకులు పాల్వంచకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ ను కలిశారు. పవన్ శాస్త్రి రోడ్డులో గల మార్కెట్ ఏరియాలో కొబ్బరికాయల వ్యాపారం నడుపుతున్నాడు. పవన్ కళ్యాణ్ పై అభిమానంతో తన షాప్ ఎదురుగా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని, తన వ్యాపారానికి జనసేన పేరు పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో జనసేనకి సపోర్టు గా ఉంటానని పవన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవా గౌడ్, పవన్ తేజ్ గౌడ్, ప్రసాద్ రాకేష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/pkkq-1024x576.jpg)