పవన్ కళ్యాణ్ సీఎం కావాలనే సంకల్పంతో జనసైనికుడి సైకిల్ యాత్ర

  • పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించు స్వామి
  • హైదరాబాద్ నుంచి తిరుపతికి సైకిల్ యాత్రగా పవన్ ముఖ్యమంత్రి కావాలనే సంకల్పంతో మధు సైకిల్ యాత్ర

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోవు ఎలక్షన్లలో కచ్చితంగా ముఖ్యమంత్రి కావాలని, ఆగస్టు 13వ తారీకున హైదరాబాదు నుంచి యన్నమల మధు అనే జనసైనికుడు సైకిల్ యాత్రగా బయలుదేరి గురువారం తిరుపతికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా తిరుపతి జనసేన పార్టీ నగర అధ్యక్షుడు రాజారెడ్డి, రాజేష్ ఆచారి, రాజమోహన్, ఆనంద్, సుమన్ బాబు, హేమంత్, ఆది, సాయి, భాషా అతిధులతో కలిసి మధుని వారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జనసైనికుడు మధు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని, తన సొంత కష్టార్జితాన్ని ప్రజలకు పంచి పెడుతున్న మా నాయకుడు ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని, అదేవిధంగా కొంతమంది అభిమానుల ముసుగులోనే ఉండిపోయారని, వారంతాకూడ జనసైనికులుగా మారి జనసేన పార్టీకి అండదండగా ఉండాలని, రాబోయే ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు ఓట్లను నమోదు చేసుకొని వారి, వారి ఓట్లను వినియోగించుకొని జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి ఖచ్చితంగా జనసేన అధినేతను ముఖ్యమంత్రిని చేసుకోవాలని, పవన్ కళ్యాణ్ గారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆంధ్ర రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చెయ్యమని ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకొందామని తిరుమలకు సైకిల్ యాత్రగా రావడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా రాజారెడ్డి మాట్లాడుతూ 2024 లో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోయేది ఒక్క పవన్ కళ్యాణ్ నేనని, ఆయన ఆశ సిద్ధాంతాలు నచ్చి ఇప్పటికే ఎంతోమంది జనసేన పార్టీలో చేరుతున్నారని, మేమంతా అహర్నిశలు కష్టపడి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేసుకుంటామని, మా జనసైనికుడు మధు కోరిక తప్పకుండానెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.