ఆసుపత్రిలో మెరుగైన సదుపాయాలు అందజేయాలి: అనిల్

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం, పాడేరు అనేది అనేక మండల మండలంలో పేద మధ్య తరగతి కుటుంబాలు, ఆలాగే నిరుపేద కుటుంబాలకి అండగా నిలబడాల్సిన అధికారులు అని చెప్పుకుంటూ, అండగా ఉండవలసిన నియోజకవర్గ నాయకులు ఎక్కడ..? జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇంచార్జీ డా.వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు జనసేన పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నామని అనిల్ అన్నారు. పేరుకే జిల్లా ఆసుపత్రి, డాక్టర్ దగ్గర నుండి, నర్సు, సిబ్బంది దగ్గర నుండి, ఆలాగే వాచ్ మెన్ వరకు, అయ్య ఇది పరిస్థితి అంటే ఆదుకునే వ్యక్తులే లేవపోవడం చాలా బాధాకరమని అన్నారు. వివరాలలోకి వెళ్తే పాడేరు నియోజకవర్గం పాత పాడేరులో నివాసం ఉంటున్న వంతాల నాగరాజు, భార్య సీతని పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. ఒక తల్లి గర్భం దాల్చిన తర్వాత నవమాసాలు మోసి, పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది. ఆ బిడ్డకు భద్రత కల్పించే విధానంలో పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం కారణంగా 10 రోజుల బాబుకి ఫిట్స్ రావడంతో ఇంజెక్షన్ అవసరం అని అడగడం జరిగింది. అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం, అనేక ఆసుపత్రులు సంప్రదించిన తర్వాత జనసేన పార్టీ డాక్టర్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘుని సంప్రదించగా ఆయన తక్షణమే స్పందించి, నిస్వార్థంగా ఇవ్వడం జరిగింది. అందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియజేస్తున్నామని తెలిపారు. ఆలాగే బాబును వెంటిలేషన్ మీద పెట్టాం కదా తర్వాత ఇంజెక్షన్ వేస్తామని తెలియజేయడం జరిగింది. 10 రోజులు బాబుని వెంటిలేషన్ మీద పెట్టడానికి కారణం ఏంటి తెలుపగలరు..? ఎమర్జెన్సీ, క్రిటికల్ కండిషన్ అని చెప్పి ఆ తల్లికి ఆపరేషన్ చేసిన వైద్యులకు తెలియదా.. ఆ తల్లి పడే బాధ ఏంటి అనేది అదే కన్నీటి బాధతో ఆ తల్లి ఎలా అయినా నా బిడ్డను రక్షించుకోవాలనే ఉద్దేశంతో, మీరు పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన చికిత్స అవగాహన లేక, లేకపోతే సరైన సదుపాయాలు లేక, ప్రజలకు, వైద్యం చేయలేకపోతున్నం అని మీ నియోజకవర్గ ప్రజల దగ్గర ఓట్ల రూపంలో గెలిచిన వ్యక్తులకు తెలియజేయలేకపోతున్నారు. ఆలాగే ఇంజెక్షన్స్ లేవు, మెడిసిన్స్ లేవు అనిచెప్పి, ఆ మెడిసిన్ దొరకక ఆ కుటుంబ సభ్యులు ఎంత బాధపడి ఉంటారు ఒకసారి ఆలోచించండి. డాక్టర్లను దేవుళ్ళు అంటారు. ఎందుకంటే మనిషిని బ్రతికించే వృత్తిని మీరు ఎందుకని దుర్వినియోగం చేస్తున్నారు. ఆలాగే పేరుకే అల్లూరి జిల్లా ఆసుపత్రి ప్రజా ప్రతినిధులు అని చెప్పుకుంటున్న ఈ వైసిపి వ్యక్తులకు ఆసుపత్రి, యాజమాన్యం, బాధ్యత తీసుకోని ఎందుకు దృష్టి పెట్టి నియోజకవర్గ నాయకులకు తెలపలేకపోతున్నారు. పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో, సరైన సదుపాయాలు లేకే కదా మీరు కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది. ఆలాగే ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ దృస్టికి ఈ సమస్యలు ఎందుకు తీసుకెళ్ళడం లేదు? ఆలాగే, వైజాగ్ కేజీహెచ్ ఆసుపత్రి ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది నేను చెప్పనా..? అక్కడకి వెళ్లిన నేపధ్యంలో ఎస్ టి సెల్ ద్వారా అన్ని సేవలు ఉచితంగా అందించాలి. అయితే ఎస్.టి సెల్ పేరుకే ఉందని మీరు గమనించగలరు. ఉచితంగా ఇవ్వవలసిన ఇంజెక్షన్, ఆలాగే, కాంట్రాస్ట్ లు, ఆలాగే సీటి స్కానింగ్, ఆలాగే, ఎం.ఆర్.ఐ స్కానింగ్, ఆలాగే క్లీనింగ్ సెక్షన్, అని హాస్పిటల్, సిబ్బంది, ఆలాగే వార్డ్ బాయ్స్ ప్రతి ఒక్కరికీ డబ్బులు అడగడం జరుగుతుంది. ప్రభుత్వాలు మీకు జీతాలు ఇవ్వటం లేదా?? మా టాక్స్ లు రూపంలో, నిరుపేద వాడు మధ్య తరగతి కుటుంబాల బాధ మీకు అర్దం కావటం లేదా, ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించని మేము టాక్స్ ల రూపంలో మీకు ఎందుకని డబ్బులు ఇవ్వాలి. అలాగే ప్రభుత్వాలు మీకెందుకు జీతాలు ఇవ్వాలి…? ఆలాగే ఎస్తి సెల్ విభాగం గిరిజనులకు అన్నీ ఉచితం అని తెలియజేసే బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాం. వైద్యం అనేది అతి కీలకం, తెలియదా…? ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజినీ మీకు కాని, మీ ముఖ్యమంత్రి అభ్యర్ధి జగన్ మోహన్ రెడ్డికి గాని చిత్తశుద్ది ఉంటే తక్షణమే స్పందించండి. అమ్మ విడుదల రజినీ నా విజ్ఞప్తి: తక్షణమే, మీ నియోజకవర్గం, నాయకులకు కానీ జగన్ మోహన్ రెడ్డి తో నువ్వు ఎం చెప్పుకుంటావో మాకు తెలియదు… నిరుపేద మధ్య తరగతి కుటుంబాలు అనేక మంది ఇంట్లో ఇళ్లు నడిపే వ్యక్తులు మరణిస్తే ఆ బాధ ఎంటో అనేది మీకు తెలియదా..? తక్షణమే చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆలాగే బాధితులు వంతాల నాగరాజు భార్య సీతకి న్యాయం చేయవలసినదిగా కోరుచున్నాము. మీరు న్యాయం చేయలేని మరుక్షణం ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లా అనే కాదు, విశాఖ జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా, రాయలసీమ, అనేక జిల్లాల జనసేన పార్టీ ముఖ్య నేతలు అలాగే నియోజకవర్గ ఇంచార్జి లు, అలాగే జనసైనికులు, వీర మహిళలు, జనసైనికులు, న్యాయం జరిగే వరకు పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నాం అని తెలిజేస్తున్నాం. అవసరం అయితే జనసేన పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకోని వెళ్తామని తెలియజేస్తున్నామని ఐటీ విభాగం సభ్యులు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు సీ.హెచ్. అనిల్ కుమార్ అన్నారు.