కూకట్పల్లిలో జనంలోకి జనసేన

కూకట్పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ 118-డివిజన్ లో జనసేన పార్టీ రాష్ట్ర మరియు కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఉదయం 10 గంటల నుండి జనసేన శ్రేణులతో కలిసి గౌతమ్ నగర్, అక్షయ కాలనీ, శోభన కాలనీ, ఫతేనగర్ పైపులైన్ రోడ్, భగత్ సింగ్ పార్క్ రోడ్డు పాదయాత్ర చేస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలకు వివరిస్తూ డివిజన్లోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కూకట్పల్లి నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో యువత గంజాయి మరియు మాదక ద్రవ్యాలు అలవాటు పడి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యం విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీని ఆదరిస్తే కూకట్పల్లి నియోజకవర్గ యువతతో పాటు రాష్ట్రంలోని యువతకి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో మంచి భవిష్యత్తు ఇస్తామని అన్నారు. ముస్లింలకు మరియు బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ జనసేన పార్టీ అండగా ఉంటుందని, ఫతేనగర్ లో డిగ్రీలు పూర్తిచేసి ఉద్యోగాలు రాని యువత, దుర్వాసనతో కూడిన కాలుష్య నాళాలు ఉన్నాయని, అర్హతలు ఉన్నా పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదని ఇది కేవలం ప్రభుత్వ యొక్క వైఫల్యం, కూకట్పల్లి నియోజకవర్గంలో నిమ్మకు నీరెత్తిన ఎమ్మెల్యే మరియు కార్పొరేటర్లు ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమమునకు ఫతేనగర్ జనసేన పార్టీ నాయకులు వెంకటేశ్వరరావు, ఎస్.కె నాగూర్, భరత్ గౌడ్, రాము, బాలాజీ, గణేష్, సురేష్, సాయి, శ్రీనివాస్ రెడ్డి, అర్జున్, స్వామి నాయుడు, శివకుమార్, బాబ్జి, కూకట్పల్లి నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు కొల్లా శంకర్, మండలి దయాకర్, వేమూరి మహేష్ నాగరాజు, నాగేంద్ర లక్ష్మణరావు మరియు వీర మహిళలు భాగ్యలక్ష్మి, కావ్య, వెంకటలక్ష్మి, మహాలక్ష్మి మరియు సైనికులు పాల్గొన్నారు.