రిపబ్లిక్ డే- కేంద్రం ప్రకటించిన అవార్డుల జాబితా

కేంద్రం తాజాగా రిపబ్లిక్ డేను పురస్కరించుకొని పద్మ అవార్దులను ప్రకటించింది, తాజాగా దివంగత గాయకుడు ఎస్పీ బాలుగారికి పద్మవిభూషన్ అవార్డు ప్రకటించారు, మొత్తం 2021లో 119 మందిని పద్మ అవార్డులకు ఎంపికచేసింది. ఏడుగురికి పద్మవిభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించారు. బాలుగారికి తమిళనాడు కోటాలో ఈ గౌరవం లభించింది.

మరి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు ఎవరు అనేది చూద్దాం

1) షింజో అబే జపాన్ మాజీ ప్రధానికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించారు

2) ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గాయకుడు, తమిళనాడు నుంచి ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు

3) బెల్లె మోనప్ప హెగ్డే, వైద్య రంగం, కర్ణాటక నుంచి

4) నరీందర్ సింగ్ కపానీ, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, అమెరికా

5) మౌలానా వహిదుద్దీన్ ఖాన్, ఆధ్యాత్మికత, ఢిల్లీ

6) బీబీ లాల్, ఆర్కియాలజీ, ఢిల్లీ

7) సుదర్శన్ సాహూ, ఆర్ట్, ఒడిషా

పద్మశ్రీ అవార్డులు ఏపీలో

అనంతపురం జిల్లా ప్రముఖ అవధాని, సీనియర్ సాహితీవేత్త డా ఆశావాది ప్రకాశ రావు పద్మశ్రీ

అన్నవరపు రామస్వామి పద్మశ్రీ

నిదుమోలు సుమతి ఆర్ట్ విభాగంలో పద్మశ్రీ