అరకు జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

అరకు నియోజకవర్గం: అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అరకు నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులు చేట్టి చిరంజీవి, కొన్నేడీ లక్ష్మణరావు, బంగురు రామదాసు, కీల్లో బాబురావు, ముల్లంగి శ్రీనివాస్ రెడ్డి, ముత్యం ప్రసాదు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరము నిర్వహించడం జరిగింది. అరకు వేలి మండలం అరకు వేలు శ్రీ వెంకటేశ్వరరావు ఆలయం కళ్యాణ మండపంలో ఎన్.వి.ఎన్ బ్లడ్ బ్యాంక్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలొ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరములో సుమారు 30 మంది రక్త దానం చేయడం జరిగింది. డుంరిగూడ మండలం, ఆరమ్మ పంచాయతీ పరిది గ్రామములో వస్త్రధాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే అరకు వేలి మండలం ఎండపల్లి వలస అనాధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా జరిగిన ఈ వేడుకలలో జనసేన నాయకులు అరకు నియోజకవర్గ నాయకులు బంగారు రామదాసు, కొన్నేటి లక్ష్మణరావు, ఎం శ్రీనివాసరెడ్డి, కిలో బాబురావు, ముత్యం ప్రసాదు, కె. చిన్న, చిరంజీవి, కే అర్జున్, పవన్ బాలేశు, అర్జున్, మజ్జి కృష్ణంరాజు, మరియు జనసైనికులు, తదితరులు వీరమహిళలు పాల్గొనడం జరిగింది.