సత్తెనపల్లిలో అంగరంగ వైభవంగా జనసేనుని జన్మదిన వేడుకలు

సత్తెనపల్లి నియోజకవర్గం, జనసేన పార్టీ ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్ని సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట్ అప్పారావు ఘనంగా నిర్వహించడం జరిగింది. తొలుత ఉదయాన్నే కోళ్ళూరు ఆంజనేయ స్వామి, దేవరంపాడు వెంకన్న స్వామి, ధూళిపాళ్ళ లక్ష్మి తిరుపతమ్మ తల్లి దేవస్థానాల్లో పవన్ కళ్యాణ్ పేరిట పూజా కార్యక్రమాలు నిర్వహించి, రాజుపాలెం మండలం కొండమోడు వీరమ్మ కాలనీలోని “దీనమ్మ అనాధ పిల్లల ఆశ్రమం”లో కేక్ కట్ చేసి, పిల్లలతో కలిసి అల్పాహారాన్ని చేశారు. అనంతరం సత్తెనపల్లిలోని “పరివర్తన అనాధ ఆశ్రమం”లో కేక్ కట్ చేసి, పిల్లలకు అల్పాహారాన్ని అందించి, వారికి అవసరమైన రూ.25,000/-లు విలువగల ఇన్వర్టర్ బ్యాటరీలను ఏర్పాటు చేసి ప్రారంభించారు. అనంతరం సత్తెనపల్లిలోని భవన నిర్మాణ కార్మికులతో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగినది. అనంతరం రెల్లి కాలనీలను సందర్శించి వారి నివాసాల వద్ద కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. తదనంతరం ఇరుకుపాలెం, చాగంటివారిపాలెం, ముప్పాళ్ళ, గోళ్ళపాడు గ్రామాల్లో జనసైనికులు ఏర్పాటు చేసిన కేకుల్ని కట్ చేసి నర్సరావుపేటలో జరుగుతున్న పల్నాడు జిల్లా జనసేనపార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలో పాల్గొన్న బొర్రా యువ సైన్యం సత్తనపల్లి నియోజకవర్గం నుండి భారీగా తరలి వెళ్ళారు. సాయంత్రం ధూళిపాళ్ల, బృగుబండ, సత్తనపల్లి పట్టణంలో వడ్డవల్లి స్వర్గీయ వంగవీటి మోహన్రంగా సెంటర్ వద్ద, నకరికల్లు మండలంలోని నకరికల్లు గ్రామంలో, చేజర్ల, కుంకలగుంట, పాపిశెట్టిపాలెం గ్రామాల్లో పర్యటించి కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమాల్లో బొర్రాతో పాటు జిల్లా పార్టీ ప్రధానకార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, తోట నర్సయ్య, శిరిగిరి పవన్, తాడువాయి లక్ష్మి, కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు బత్తుల కేశవ, నాయకులు దార్ల శ్రీనివాసరావు, రామిశెట్టి శ్రీనివాసరావు, నామాల పుష్పలత, చిలకా పూర్ణ, రఫీ, జానీ తదితరులు ఉన్నారు.