సంతవేలురులో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు
సత్యవేడు నియోజకవర్గం: వరదయ్యపాలెం మండలం, సంతవేలురు గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మండల అధ్యక్షుడు చిరంజీవి యాదవ్, ఉపాధ్యక్షులు తులసిరామ్ శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. జనసేన నాయకులు కార్యకర్తల రక్తదానం చేయడం జరిగింది. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి బహుమతులు అందించడం జరిగింది. కేక్ కట్ చేసి, పేదలకు అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జ్ శ్రీమతి వినుత కోట, శ్రీకాళహస్తి నియోజకవర్గం నాయకుడు చంద్రబాబు కోట, శ్రీకాళహస్తి నియోజకవర్గం నాయకులు గణేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వినుత మాట్లాడుతూ పేదలకోసం ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని రాబోయేది జనసేన ప్రభుత్వం అని, రాబోయే ఎన్నికల్లో సత్యవేడు నియోజకవర్గములో జనసేన అభ్యర్థిని గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇవ్వాలని కార్యకర్తలకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శేఖర్ తులసి రామ్ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ కమిటీ సభ్యులు పవన్, సురేష్, సత్యనారాయణ శ్రీనివాసయ్య, కుమార్, హరి, కృష్ణయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-03-at-5.17.11-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-03-at-5.17.09-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-03-at-5.17.08-PM.jpeg)