“ఒక్క అవకాశం ఇవ్వండి” వీడియో సాంగ్ లాంచ్

  • వుయ్యాల శ్రీనివాస్ గారి చేతులమీదుగా “ఒక్క అవకాశం ఇవ్వండి” వీడియో సాంగ్ లాంచ్

చిత్తూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్బంగా “జనగణమన ఒక అవకాశం ఇవ్వండి” పాట ద్వారా సమాజానికి మరియు యువతకు ఓటు యొక్క విలువను తెలియచేయాలి అనే ఒక ఉద్దెశం తో హార్ట్ బీట్ మెలోడీస్ ఛానల్ ద్వారా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం జనసైనికుడు చిన్నా చేసిన చిన్న ప్రయత్నం. ఈ పాటను జనసైనికులు అందరూ చూసి 2024 ఎలక్షన్స్ లో ఓటు వేసే ముందు ఒక్క సారి ఆలోచించి మీ అమూల్యమైన ఓటును జనసేనకు వేయాలి అని కోరుకుంటున్నాము. ఈ పాట ని జనసేన రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ వుయ్యాల శ్రీనివాస్ ద్వారా రిలీజ్ చేస్తూ చిన్నా గారిని, హార్ట్ బీట్ మెలోడీస్ టీమ్ ను అభినందించారు. పాట పాడిన సరిగామప పవన్ కళ్యాణ్ గారికి మరియు హార్ట్ బీట్ మెలోడీస్ ఛానల్ కి పాటని ఇంత అద్భుతం గా రాసిన చిన్నాకి మరియు పూతలపట్టు ఐటీ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ కి జనసైనికుడు దినేష్ కి మరియు నానాభాల లోకేష్ కు కృతజ్ఞతలు. మరొకసారి జనసేనాని పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.