పవన్ కళ్యాణ్ దే పిఠాపురం పీఠం

పిఠాపురం, నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యంగా వైసీపీ నేతలు మహా కుట్రలకు తెరతీసారని, జగన్ రెడ్డి ఎన్ని కుయుక్తులు, మరిన్ని పన్నాగాలు పన్నినా పిఠాపురం పీఠం పవన్ కళ్యాణ్ దేనని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపధ్యంలో రాష్ట్ర రెల్లి యువ నేత సోమి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో పిఠాపురంలోని ఒకటవ డివిజన్ అగ్రహారంలో రెల్లి సంఘీయులతో ఆదివారం ప్రత్యేక ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశ వివరాలను సోమవారం ఆళ్ళ హరి మీడియాకు వివరించారు. తాను రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నట్లు ఎప్పుడైతే పవన్ కల్యాణ్ ప్రకటించారో అప్పటినుంచి ఆయన్ని తమ కుటుంబ సభ్యుడుగా రెల్లి సంఘీయులు భావిస్తున్నట్లు తెలిపారు. పవన్ కల్యాణ్ తమ ఆత్మగౌరవాన్ని ఇనుమడింప చేశారన్న కృతజ్ఞత ప్రతీ రెల్లి హృదయంలో దాగుందని పేర్కొన్నారు. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయటం తమ అదృష్టంగా భావిస్తున్నామని, ఆయన్ని గెలిపించుకోవడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని రెల్లి సంఘీయులు తెలపటం శుభపరిణామమని ఆళ్ళ హరి తెలిపారు. రాష్ట్ర కార్మిక సంఘ నేత సోమి శంకరరావు మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం చరిత్రలో నిలిచిపోయేలా అందించటానికి రెల్లి జాతి సంసిద్ధంగా ఉందన్నారు. రెల్లి జాతి పెద్దలు పాపారావు మాట్లాడుతూ తమ జాతి ఎదురుకుంటున్న సమస్యల్ని ఒక నివేదిక రూపంలో పవన్ కల్యాణ్ కు అందిస్తామన్నారు. మా కష్టాలపై, రెల్లి జాతి జీవనవిధానంపై పవన్ కళ్యాణ్ కు పూర్తి అవగాహన ఉందని, ఆయన వస్తేనే తమ జాతికి మేలు జరుగుతుందని పాపారావు తెలిపారు. అనకాపల్లి రెల్లి నేత కోన అప్పారావు మాట్లాడుతూ పవన్ కల్యాణ్ లాంటి నిజాయితీ పరుడుని అసెంబ్లీకి పంపే ప్రతీ ఓటు ఎంతో గర్వపడుతుందని తెలిపారు. కాకినాడ జిల్లా టీడీపీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు బండి నరేంద్ర మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని, పవన్ కల్యాణ్ లాంటి నాయకుడు రాష్ట్రానికి ఎంతో అవసరం అన్నారు. మన గుర్తు గాజు గ్లాస్, మన నాయకుడు పవన్ కల్యాణ్ అంటూ స్ఫూర్తినిచ్చేలా నరేంద్ర ప్రసంగించారు. అనంతరం పిఠాపురం ఒకటవ డివిజన్ జనసేన అధ్యక్షుడు అల్లం కిషోర్ ఆధ్వర్యంలో రెల్లి సంఘీయులతో కలిసి డివిజన్ లో పర్యటించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు గడ్డం రోశయ్య, సయ్యద్ షర్ఫుద్దీన్, షేక్ నాజర్ వలి, నరసింహ, నండూరి స్వామి, నాని, విజయ్, సాంబ తదితరులు పాల్గొన్నారు.