భవన నిర్మాణ కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవాలి: అతికారి దినేష్

  • భవన నిర్మాణ కార్మికుని కుటుంబాన్ని వైఎస్ ఆర్ బీమా వర్తింపజేసి ఆదుకోవాలని తహసీల్దార్ ను కోరిన రాజంపేట జనసేన పార్టీ నాయకులు అతికారి దినేష్

రాజంపేట నియోజవర్గం: చుండూరు వారి పల్లిలో జరిగిన జగనన్న కాలనీలో నాణ్యత లోపం వల్ల ఇంటి మెట్ల నిర్మాణం కూలిన ప్రమాద ఘటనలో మరణించిన భవన నిర్మాణ కార్మికుడు వడ్డే నారాయణ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని రాజంపేట తహసీల్దార్ సుబ్రహ్మణ్యం ను రాజంపేట జనసేన పార్టీ నాయకులు అతికారి దినేష్ కోరారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకునేలా ప్రయత్నాలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ సంధర్భంగా అతికారి దినేష్ మట్లాడూతూ
ప్రమాదం జరిగి 3రోజులు గడిచినా ప్రభుత్వం, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ విషయం పట్ల స్పందించలేదు. కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించను కూడా లేదు. కనీసం వారికి న్యాయం చేయాలని ఆలోచనలో కూడా లేకుండా ఉన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సదరు కుటుంబానికి న్యాయపరమైన భీమా డబ్బులు ఇచ్చి ఆదుకోవాలని అతిగారి దినేష్ డిమాండ్ చేశారు. నాసిరకమైన కట్టడాల వలన ప్రజల ప్రాణాలు తీసే ఇలాంటి నకిలీ కాంట్రాక్టర్లని ప్రభుత్వం ప్రోత్సహించకూడదని కూడా రాజంపేట నియోజకవర్గ నాయకుడు దినేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డిరాణి, కత్తి సుబ్బరాయుడు, కోలటం హరికృష్ణ, గుగ్గీళ్ళ నాగార్జున తదితరులు పాల్గోన్నారు.