ఘనంగా ఎంపిపి శ్రీమతి మేడిచర్ల సత్యవాణి రాము పుట్టినరోజు వేడుకలు

  • రామరాజులంకలో ఎంపిపి మేడిచర్ల సత్యవాణి రాము జన్మదిన వేడుకలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, రామరాజులంక గ్రామంలో జనసేన పార్టీ మలికిపురం మండలం ఎంపిపి శ్రీమతి మేడిచర్ల వెంకట సత్యవాణి రాముతో కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజోలు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మేడిచర్ల సత్యనారాయణ (బంక్ అబ్బులు), మేకల ఏసుబాబు, ముప్పర్తి నాని ప్రసాద్, వీర వెంకట్ ఎరుబండి చిన్ని తదితరులు పాల్గొన్నారు.

  • మలికిపురంలో ఎంపిపి మేడిచర్ల సత్యవాణి రాము జన్మదిన వేడుకలు

రాజోలు నియోజకవర్గం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో మలికిపురం జనసేన పార్టీ ఎంపిపి మేడిచర్ల సత్యవాణి రాము జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మలికిపురం మండలం మలికిపురంలో జనసేన నాయకులు గుండుబోగుల పెదకాపు నివాసం వద్ద, జనసేన పార్టీ ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము జన్మదిన వేడుకలు రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు తదితరులు పాల్గొనడం జరిగింది.

విగ్రహ ప్రతిష్ఠల మహోత్సవములో పాల్గొన్న జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, రామరాజులంక గ్రామంలో శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక, అభయ ఆంజనేయ స్వామి వార్ల నూతన విగ్రహ ప్రతిష్ఠల మహోత్సవములో మలికిపురం ఎంపిపి శ్రీమతి మేడిచర్ల సత్యవాణి రాము, రాజోలు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మేడిచర్ల సత్యనారాయణ (బంక్ అబ్బులు), మేకల ఏసుబాబు, ముప్పర్తి నాని ప్రసాద్, వీర వెంకట్, ఎరుమండి చిన్ని తదితరులు పాల్గొన్నారు.