సైకో పాలనకు బై బై చెబుదాం – నిబద్దత గల ప్రభుత్వానికి హలో చెబుదాం

  • జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి పోలసపల్లి సరోజ

కాకినాడ రూరల్ నియోజకవర్గం: కరప మండలం కొరిపల్లి గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కాకినాడ ప్రధమ మేయర్ శ్రీమతి పోలసపల్లి సరోజ, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు శ్రీమతి & పిల్లి అనంతలక్షి సత్యనారాయణ మూర్తి మూడవ రోజు ఇంటింటికి పర్యటన చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ప్రజలు అక్కడి ఇబ్బందులను వివరిస్తూ మంచినీటి సమస్యలు, గతుకులు పడిన రోడ్లు, మురుగు నీటి సమస్యలు గురించి మొరపెట్టుకున్నారు. అవినీతి, అక్రమాల కొలువైన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే దిశగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాబోయే జనసేన-తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందనీ, ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు సత్వరమే అందుతాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.