వైసీపీ చేసే దాష్టికాలను ప్రజలు గమనిస్తున్నారు: రాందాస్ చౌదరి

మదనపల్లి నియోజకవర్గం: వైసీపీ చేసే దాష్టికాలను విపక్షాలు, ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారని రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి పేర్కొన్నారు. మదనపల్లి జనసేన కార్యలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాందాస్ చౌదరి మాత్లాదుతూ రెండు రోజుల క్రితం ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు గారు రేపో మాపో నన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అన్నారంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం అవుతాంది అని అన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిని, ఒక ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిని సరైన ఎఫ్.ఐ.ఆర్ లేకుండా, స్కాం జరిగిందని ఎటువంటి ఆధారాలు లేకుండా సాక్షాధారాలు లేకుండా 73 సంవత్సరాల పెద్దాయనను అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ దాడిని ఈరోజు పత్రికా సమావేశంలో పూర్తిగా ఖండిస్తూ, శాంతి భద్రతల సమస్యలు తలెత్తే వైసీపీ వాళ్ళతో, వైసీపీ వాళ్ళ చేత, వైసీపీ వాళ్ళ కొరకు వాళ్ళు వచ్చి విపక్షాలను విమర్శించడం హాస్యాస్పదంగా ఉంది అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని గురి చేసిన బాధ, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆయన మానసిక క్షోభకు గురి చేసిన బాధ అంతా కూడా రాబోయే కాలంలో తగిన మూల్యం చేల్లించుకొంటుందని తెలియజేసారు. ముఖ్యంగా మదనపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సిపిఐ సిపిఎం, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు మేము ఇస్తున్న హామీ, స్నేహ హస్తం ఎవరినైనా అక్రమ కేసులో ఇరికించినా, ప్రతిపక్ష పార్టీలకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వారికి సంఘీభావం తెలిపే వారికి తోడుగా అండగా ఉంటామని జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రామసముద్రం మండలం ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మిపతి, ఐటీ విభాగ నాయకులు జగదీష్, లక్ష్మినారాయణ కల్లూరు, జంగాల గౌతమ్, గండికోట లోకేష్, నవాజ్, జనర్దన్ తదితరులు పాల్గొన్నారు.