టిడిపి మేము సైతం రిలే నిరాహార దీక్షకు కొలిమిగుండ్ల జనసేన మద్దతు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు చేసిన నేపథ్యంలో అరెస్టును నిరసిస్తూ కొలిమిగుండ్ల మండలంలో బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న టిడిపి పార్టీ నాయకులకు మద్దతుగా కొలిమిగుండ్ల మండల జనసేన పార్టీ నాయకులు పృద్వి, పెద్దయ్య మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా పృద్వి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేదని అర్ధరాత్రి అరెస్టు చేయడానికి పార్టీ ఖండిస్తుందని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీలపై కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి గురి చేస్తున్నారని ఇందులో అన్ని పార్టీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కుమార్, ప్రతాప్, సందీప్, వినయ్ రాజు సూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.